నాగర్ కర్నూల్ : జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలో కుక్కలు స్వైరవిహారం (Dog Attack) చేశాయి. పట్టణంలోని 19వ వార్డులో రెండేళ్ల బాలుడిపై దాడి చేసి గాయపరిచాయి. ఇంటి ఆవరణలో రెండేళ్ల బాలుడు సూఫీయాన్ ఆడుకుంటుండగా ఒక్కసారిగా అటుగా వచ్చిన కుక్కలు అతడి ముఖంపై దాడి చేశాయి. స్థానికులు పరుగున వచ్చి కుక్కలను తరిమి వేసి గాయపడ్డ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. కుక్కలను అరికట్టాలని గతంలో అనేకసార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.