నాగర్‌కర్నూల్/నర్వ, ఏప్రి ల్17 : వడ దెబ్బకు ఇద్దరు మృతి చెందిన ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో వేర్వు రు ఘటనలో చోటు చేసుకున్నది. నాగర్‌కర్నూల్ జిల్లాలో తాడూ రు మండలంలో యంగంపల్లి గ్రామానికి చెందిన అంతటి ఆంజనేయులు(42) ప్రైవేట్‌గా ఎలక్ట్రిషియన్ పనులు చేసేవాడు. గురువారం యథావిధిగా పనులకు వెళ్లాడు. ఎలక్ట్రిషియన్ పనులు ముగించుకొని ఇంటికి వచ్చాక చన్నీటితో స్నానం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య బుచ్చమ్మతోపాటు ఇద్దరు ఆడపిల్లలు, కొడుకు ఉన్నారు.
అలాగే నారాయణపేట జిల్లా నర్వ మండలం ఉందేకోడ్ గ్రామనికి చెందిన ఎండీ సర్ధార్(40) వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ మృతిచెందాడు. సర్ధార్ వంట మాస్టారుగా పని చేస్తూ జీవనం సాగించేవాడు. రెండు రోజుల కింద పని మీద వెళ్లిన సమయంలో ఎండలో ఎక్కువ సేపు ఉండడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య ఆశాబీ, కొడుకు ఉన్నారు. మృతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.