అయిజ, ఏప్రిల్ 5 : దైవదర్శనార్థం వెళ్తుండగా బొలేరో బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన ఘటన శుక్రవారం ఉత్తనూరు సమీపంలో చోటు చేసుకున్నది. ఎస్సై విజయ్‌భాస్కర్ కథనం మేర కు.. కర్ణాటకలోని మీర్జాపురం, ఇడుపునూరు గ్రామాలకు చెందిన బంధువులు కర్నూల్ జిల్లాలోని మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం శుక్రవారం ఆయా గ్రా మాల నుంచి దాదాపు 25మంది భక్తులు బయలుదేరారు.
మార్గమధ్యలోని అయిజ మండలం ఉత్తనూర్ గ్రామ సమీపంలోని 33/ 11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో బొలేరో వాహనంలో తలెత్తిన సాంకేతిక సమస్యలతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురికి తీ వ్ర గాయాలయ్యాయి. స్పందిన చుట్టుపక్కల రైతులు, ఉత్తనూర్ గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రుల ను 108లో దవాఖానకు తరలించారు. తీవ్రగాయాలైన నాగ ప్ప, మనోజ్, రంగప్ప, నర్సమ్మలను కర్నూల్, రాయిచూర్ దవాఖానలకు తరలించారు.
కర్నూల్‌కు తరలిస్తుండగా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి లక్ష్మి, నాగప్పల కుమారుడు మనోజ్ (9), మీర్జాపురం నాగప్ప(45) మార్గ మధ్య లో మృతి చెందారు. రంగప్ప కర్నూల్, నర్సమ్మ రా యిచూర్లో చికిత్స పొందుతున్నారు. స్వల్పగాయాలైన క్షతగాత్రులకు అయిజలో చికిత్స అందించి సొం త గ్రామాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు న మోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. దైవదర్శనార్థం వెళ్తున్న భక్తులు ప్రమాదబారిన పడి మృత్యువాత పడడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.