ఎర్రవల్లి చౌరస్తా, ఆగస్టు 27: రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందిన ఘటన ఆదివారం ఇటిక్యాల పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నది. ఎస్సై అశోక్బాబు కథనం ప్రకారం.. కర్ణాటక హసీకేరీహసన్ జిల్లాకు చెందిన ముత్తురాజ్(22), ముబారక్(19) కలసీ కర్ణాటకలోని హసన్ జిల్లా నుంచి హైదరాబాద్కు అశోక్లెలాండ్ వాహనంలో అల్లంలోడ్డు తీసుకొని వెళ్తున్నారు. మార్గమధ్యలో ఆదివారం తెల్లవారుజామున బీచుపల్లి బ్రిడ్జి దగ్గరకు రాగానే వాహనం టైర్ పంక్చర్ అయింది.
దీంతో బీచుపల్లి బ్రిడ్జిపై వాహనాన్ని నిలిపి టైర్ మార్చుకుంటుండగా కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఐ10కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అశోక్లెలాండ్ వాహనం కూలబడింది. వాహనం కింద ఉన్న ముత్తురాజ్, ముబారక్ ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను గద్వాల మార్చురీకి తరలించారు. కారు డ్రైవర్ జోతీష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.