పండుగ పూటవిషాదం
సరదాగా గ్రామ సమీపంలోని నీటి గుంతలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా హన్వా డ మండలం చిన్నదర్పల్లిలో చోటు చేసుకున్నది. హన్వాడ ఎస్సై రవినాయక్ కథనం మేరకు మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదర్పల్లికి చెందిన శివ (9), గణేశ్ (9) నాలుగో తరగతి చదువుతున్నారు.
- నీటిగుంతలో పడి చిన్నారులు మృతి
- హన్వాడ మండలం చిన్నదర్పల్లిలో ఘటన
మహబూబ్నగర్, మెట్టుగడ్డ, జూలై 11 : సరదాగా గ్రామ సమీపంలోని నీటి గుంతలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా హన్వా డ మండలం చిన్నదర్పల్లిలో చోటు చేసుకున్నది. హన్వాడ ఎస్సై రవినాయక్ కథనం మేరకు మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదర్పల్లికి చెందిన శివ (9), గణేశ్ (9) నాలుగో తరగతి చదువుతున్నారు.
అయితే మంగళవారం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా ఇంటి వద్దే ఉన్న ఇద్ద రు కలిసి గ్రామ సమీపంలోని నీటి గుంత వద్దకు సరదాగా ఈత కొట్టడానికి వెళ్లాడు. నీటిలోకి దిగగా లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి చూసే వరకు విగతజీవులుగా మారారు. మృతదేహాలను బయటకు తీయగా కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి. పండుగ పూట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- Children died
- fall
- waterhole
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

