వనపర్తి : పోలీసుశాఖ తరఫున ఏర్పాటు చేస్తున్న ఫిల్లింగ్ స్టేషన్ల ( Filling Stations) లో నాణ్యమైన పెట్రోల్( Petroll), డీజిల్ ( Diesel) ను వాహనదారులకు అందించడం ద్వారా ప్రజలకు పోలీస్ ఫిల్లింగ్ స్టేషన్లపై నమ్మకం పెరిగిందని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఐజీపీ రమేష్ రెడ్డి (IGP Ramesh Reddy ) అన్నారు.
వనపర్తి మండలం రాజపేట గ్రామ శివారులో తెలంగాణ పోలీసు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పోలీసు పెట్రోల్ బంక్‌ను వనపర్తి ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి ( MLA Megareddy ) , వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి , వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ వనపర్తి, కొత్తకోట, హైదరాబాద్ రోడ్డు మార్గాలలో వాహనదారులకు మరింత నాణ్యంమైన పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులను అందించేందుకు పోలీసు పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే , కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని భూమిని అందజేసి అత్యంత తక్కువ సమయంలో వేగవంతంగా నాలుగు నెలల్లో రికార్డు స్థాయిలో నిర్మాణం పూర్తిచేయడానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
వనపర్తి శాసనసభ్యులు తూడిమెఘారెడ్డి మదనాపురం రైల్వే స్టేషన్ నుంచి వనపర్తి వరకు 20 కిలోమీటర్లు కొత్త కారిడార్‌ను నాలుగు లైన్ల రహదారిని నిర్మించడానికి ప్రభుత్వ అనుమతి తీసుకుని రహదారిని పూర్తిచేసేందుకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, వనపర్తి సీఐ కృష్ణయ్య, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూర్ సీఐ శివకుమార్, సీసీఎస్ సీఐ రవిపాల్, ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, ఐఓసీఎల్ డివిజనల్ హెడ్ సుదీప్తో మిత్త, సీనియర్ మేనేజర్ శరణ్య, చీఫ్ మేనేజర్, అమర్ శ్రీనివాసు, మహబూబ్ నగర్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.