
భూత్పూర్, డిసెంబర్ 14: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు జాతీయపార్టీలకు చెంపపెట్టని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ప్రకటించిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలో 2, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మంలో టీఆర్ఎస్ గెలుపొందడంపై మున్సిపాలిటీ కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాలుస్తూ సంబురాలను చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ప్రచారంలో టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఓటర్లపై ఎన్నో అసత్య ఆరోపణలు చేశారని, కాంగ్రెస్, బీజేపీ నాయకులు వాపును చూసి బలుపనుకున్నారని తెలిపారు. ప్రజాసంక్షేమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జాతీయ పార్టీలను ఓడించి బంపర్ మెజార్టీతో మరోసారి టీఆర్ఎస్ అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్నారు. రానున్న మరో 20ఏండ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీలు అసత్య ప్రచారాలు ఆపాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు శ్రీనివాసులు, ఆంజనేయులు, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, నాయకులు మనెమోని సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, సాయిలు, రామునాయక్, రాకేశ్, సూరి, గడ్డంరాములు, బోరింగ్ నర్సింహులు, ప్రేమ్‌కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.