జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 3 : మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా జడ్చర్లలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. శనివారం జడ్చర్లలో లక్ష్మారెడ్డికి ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
కావేరమ్మపేట, జడ్చర్ల, బాదేపల్లి పట్టణాల్లో జరిగిన కేక్కటింగ్కు లక్ష్మారెడ్డితోపాటు శ్రీనివాస్‌గౌడ్ కూడా హాజరయ్యారు. స్థా నిక వేంకటేశ్వరస్వామి ఆలయం లో పూజలు చేశారు. అనంతరం స్థానిక చంద్రగార్డెన్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.
శిబిరంలో రక్తదానం చేసిన 1,023 మందికి లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎంబీ మెడిక ల్ దవాఖాన నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. లక్ష్మా రెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజినీసాయిచంద్, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజా ప్ర తినిధులు పా ల్గొన్నా రు.