ధాన్యం కొనుగోలును పట్టించుకోని కేంద్రంపై చావు డప్పు మోగింది. రైతన్నకు మద్దతుగా వరుస నిరసనలతో గులాబీ దండు గర్జిస్తున్నది. శుక్రవారం నల్లజెండాలతో ప్రదర్శన చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండాలను ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు భారీగా తరలిరాగా.. రైతులు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. పాలమూరు జిల్లా జమిస్తాపూర్‌లోని సర్పంచ్ ఇంటిపై క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నల్ల జెండా ఎగురవేశారు. అలాగే గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వనపర్తిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో డప్పుల దరువుల మధ్య ర్యాలీ చేపట్టారు. గోపాల్పేట మండలం బుద్ధారం సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో నల్ల జెండాలను ప్రదర్శించారు. నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి.
మహబూబ్‌నగర్/రూరల్, ఏప్రిల్ 8 : కేంద్రం కక్ష సాధింపు చర్యలకు ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగు వేయమని ఎక్సైజ్, క్రీడా శా ఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రైతులు నెలల తరబడి శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పడం సరికాదని.., అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోమని హెచ్చరించా రు. శుక్రవారం మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని జమిస్తాపూర్ గ్రా మంలో మంత్రి నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్రం పనితీరు బాగాలేదని, వ్యవసాయ మోటర్లకు మీట ర్లు పెట్టేందుకు యత్నిస్తుందన్నారు. ఇది సరైన విధానం కాదని ఇప్పటికే చెప్పామన్నా రు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అందనంత ఎత్తుకు పెంచి సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నదన్నారు. ధరలను కట్టడి చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలని చూస్తున్నారన్నారు. అందరం సీఎం కేసీఆర్‌కు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. కక్షసాధింపు చర్యలకు వెనుకడుగు వేయమని తెలిపారు. ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జమిస్తాపూర్ సర్పంచ్ రాంచంద్రయ్య ఇంటిపై నల్లా జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రై తుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మం డలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చై ర్మన్ ఆంజనేయులు, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, దే వేందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.