ఊట్కూర్ : బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి దివంగత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ( Dayakar Reddy ) ఎనలేని కృషి చేశారని మాజీ జడ్పీటీసీ సూర్యప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం దయాకర్ రెడ్డి ద్వితీయ వర్ధంతి ( Death Anniversary ) సందర్భంగా మెయిన్ బజార్ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా నివాళి (Tribute) అర్పించారు.
అనంతరం ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో రోగులకు పండ్లు, బ్రెడ్డు, బిస్కెట్లు పంపిణీ చేశారు. దయాకర్ రెడ్డి గ్రామీణ ప్రాంతాలలో విద్య, వైద్యం, త్రాగునీరు, రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీతా దయాకర్ రెడ్డి, యువసేన మండల అధ్యక్షుడు నరసింహ గౌడ్, మాజీ ఎంపీపీ మణెమ్మ గోపాల్ రెడ్డి, లక్ష్మయ్య, పీహెచ్ సీ వైద్యురాలు భవాని, ఏఎన్ఎంలు శైలజ, నాగమ్మ, నర్సింహులు పాల్గొన్నారు.