హన్వాడ, మే 31 : మండలంలోని దొర్రితండాకు వెళ్లే రోడ్డు పనులను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గిరిజనులు శనివారం మహబూబ్నగర్-తాండూర్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ దొర్రితండాకు ఇటీవలే బీటీ రోడ్డు మంజూరైందని, ఈ మార్గంలోనే గుడి ఉండడంతో అక్కడ గుడి చుట్టూ దిమ్మె కట్టిచ్చేందుకు గ్రామస్తులు అంగీకరించారన్నారు.
కాగా, మాజీ సర్పంచ్ మాత్రం దిమ్మె ఏర్పాటు చేయాలని పనులను అడ్డుకుంటున్నాడని తెలిపారు. రోడ్డు పనులను అడ్డుకోవడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే పనులు చేయాలని డిమాండ్ చేశారు.