సఫారీ టూరు బ్రేక్
ప్రకృతిని అల్లుకున్న అద్భుత భూ మి నల్లమల. చెట్లు, చేమలు, పక్షుల కిలకిల, పులుల గర్జనలు ఇలాంటి సహజ దృశ్యాలు మరెక్కడా కనిపించవు.. ఇదే నల్లమల ప్రత్యేకత. ఇప్పుడు ఈ అడవి వన్యప్రాణుల కోస మే ఓ తాత్కాలిక విరామాన్ని ప్రకటించింది.
- ఏటీఆర్‌లో మూడు నెలలు మూసివేత
- రేపటి నుంచి సెప్టెంబర్ 30 వరకు నల్లమలలో యాత్ర బంద్
- వన్యప్రాణుల సంతానోత్పత్తికి అనుకూల సమయం కావడమే కారణం
అచ్చంపేట, జూన్ 29 : ప్రకృతిని అల్లుకున్న అద్భుత భూ మి నల్లమల. చెట్లు, చేమలు, పక్షుల కిలకిల, పులుల గర్జనలు ఇలాంటి సహజ దృశ్యాలు మరెక్కడా కనిపించవు.. ఇదే నల్లమల ప్రత్యేకత. ఇప్పుడు ఈ అడవి వన్యప్రాణుల కోస మే ఓ తాత్కాలిక విరామాన్ని ప్రకటించింది. వన్యప్రాణుల సంతానోత్సత్తికి అనుకూలంగా వాతావరణం మారు తుండడంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) అధికారులు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడు నెలల పాటు ఫర్హాబాద్, అక్కమహదేవీగుహలు సఫారీ ప్యాకేజీ సేవలను నిలిపివేయనున్నారు. వర్షాకాలం రావడంతో నల్లమల అడ వి పచ్చదనంతో ఆకట్టుకుంటుంది. మొక్కలు, గడ్డి వృక్షావళి పెరిగి అడవి జీవులకు ఆహారం, ఆశ్రయం కల్పిస్తున్నా యి. ఇది పులులు, చిరుతలు సహా వన్యప్రాణులు జతకట్టే, సంతానోత్పత్తి చేసే ముఖ్యమైన కాలం.
ఏటా ఈ మూడు నెలలపాటు పర్యాటకులను అడవిలోకి అనుమతించరు. అక్టోబర్ 1న మళ్లీ సఫారీ సేవలు పునఃప్రారంభం అవుతాయి. యాత్రికులు అటవీప్రాంతంలోని అందాలు తిలకించేందుకు ప్రతిరోజూ సఫారీ ప్యాకేజీ ద్వారా లోపలికి వెళ్లి తిలకించేవారు. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటా యి. శ్రీశైలం పుణ్యక్షేత్రం, ఉమామహేశ్వ రం, మద్దిమడుగు లాంటి పేరుగాంచిన ఆకట్టుకునే దైవక్షేత్రాలు ఉన్నందున పెద్దసంఖ్యలో యాత్రికులు, భక్తులు వస్తుంటారు. యాత్రికులు సఫారీ ప్యాకేజీ ద్వారా నల్లమల అందాలు తిలకించేందుకు ఇష్టపడుతుంటారు. వన్యప్రాణుల సంతానోత్పత్తికి అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టారు. అటవీలోకి జనసంచారం లేకుండా అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు వన్యప్రాణులకు ఎ లాంటి అటంకాలు లేకుండా స్వేచ్ఛగా విహరించడంతోపా టు తమ సంతానోత్పత్తిని పెంచేందుకు కావాల్సిన జాగ్రత్త చర్యలు చేపట్టారు.
వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెంచనున్నారు. ఈ మూడు నెలల పాటు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా నల్లమలలోకి ప్రవేశించేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. అదేవిధంగా ఏపీలోని శ్రీశైలం శిఖరం నుంచి ఇష్టకామేశ్వరి ఆలయానికి కూడా సఫారీ సేవలు నిలుపుదల చేశారు. ఏపీలోని నెక్కంటి జంగీల్ రైడ్ యాత్రికులు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రతిరోజూ భక్తులు భారీగా వెళ్తుంటారు. జాతీయ పెద్దపులుల సంభోగ సమయంగా భావిం చి జూలై 1 నుంచి నెక్కంటి జంగీల్రైడ్ కూడా నిలిపిస్తున్నట్లు రేంజ్ అధికారులు తెలిపారు.
సఫారీ నిలిపివేత
వన్యప్రాణుల సంతానోత్సత్తి కోసం ప్రతి ఏడాది మాదిరిగా ఈ సారి కూడా నల్లమలలో మూడు నెలల పాటు సఫారీ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నాం. జూలై 1నుంచి సెప్టెంబర్ 30 వరకు యాత్రికులను అనుమతించడం లేదు. ఈ మూడు నెలలు పెద్దపులి జతకట్టే రోజులతోపాటు ఇతర అనేక వన్యప్రాణులు సంతానోత్పత్తికి అనుకూలమైన సమయం. ఫరహబాద్ వ్యూపాయింట్, అక్కమహాదేవి గుహాలు సఫారీ సేవలను నిలిపివేయనున్నాం. తిరిగి అక్టోబర్ 1నుంచి పునః ప్రారంభించడం జరుగుతుంది. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశాం. యాత్రికులు, స్థానికులు అటవీశాఖ అధికారులకు సహకారం అందించాలి.
– రేవంత్‌చంద్ర, డీఎఫ్‌వో
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

