మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, అక్టోబర్ 8 : మహబూబ్‌నగర్ పట్టణంలోని కోయనగర్ పరిధిలో ఉన్న కృషి మహిళా సంఘానికి ఈ నెల 4వ తేదీన రూ.20 లక్షల రుణాన్ని రీసోర్స్ పర్సన్ (ఆర్పీ) ఇప్పించారు. ఆ తర్వాత కృషి మహిళా సంఘంలోని రూ.10 లక్షలను శ్రీ మంజునాథ సంఘానికి రూ.6 లక్షలు, శివసాయి సం ఘానికి రూ.4లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. డబ్బుల లా వాదేవీలకు సంబంధించి సంఘం సభ్యులకు ఎస్ఎంఎస్ రావడంతో బ్యాంక్ అధికారులను సంప్రదించారు. తమ సంఘం నుంచి అనుమతి లేకుండా ఇతరులకు రూ.10 లక్షలు ఎలా ట్రాన్స్ఫర్ చేశారని ప్రశ్నించారు. దీంతో బ్యాంక్ అధికారులు ఆ డబ్బులను తిరిగి ఖాతాలో జమచే శారు. ఇందుకు కారణమైన ఆర్పీని పిలిచి సర్దిచెప్పారు.
తీగ లాగుతారా? కప్పి పెడుతారా?
కోయనగర్ ఎస్ఎల్ఎఫ్ పరిధిలో 33 స్వయం సహాయక సంఘాలు ఉండగా.. సుమారు రూ.కోటికిపైగా బ్యాంక్ లింకేజీ రుణాలు గోల్మాల్ జరిగినట్లు సభ్యులు వాపోతున్నారు. ప్రతి సంఘం పేరిట రూ.10 లక్షల వర కు లోన్ తీసుకున్నట్లు ఉందంటున్నారు. ఈ విషయంపై మున్సిపల్, మెప్మా, బ్యాంక్ అధికారులు తీగ లాగితే డొంక కదిలే అవకాశాలు ఉన్నా.. అటువైపు దృష్టి సా రించడం లేదని ఆరోపిస్తున్నారు. బ్యాంక్ రుణాలు తమ పేరిట తీసుకుని అక్రమంగా వాడుకుంటున్నా.. అధి కారులు గుర్తించకపోవడం, ఆ భారం తమపై పడు తుం డడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోయ నగర్‌లోని మొత్తం సంఘాల్లో బ్యాంకు, పొదుపు, స్త్రీనిధి ద్వారా ఎన్ని అక్రమాలు జరిగాయనేది లేల్చాల్సి ఉన్నది.
పర్యవేక్షణ లోపమే కారణమా?
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉండగా.. 2,826 స్వయం సహాయక సంఘాల్లో 28,036 సభ్యులు ఉన్నారు. వీరిపై పర్యవేక్షణ, బ్యాంక్ లింకేజీ రుణాలు, ఇతర కార్యక్రమాల అమలుకు మెప్మా కార్యాలయం నుంచి మానిటరింగ్ అధికారులుగా కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీవో)లు ఉంటారు. ప్రతి నెలా సంఘాల సమావేశాలకు హాజరుకావడంతోపాటు సభ్యు లు తీసుకుంటున్న రుణాలు, చెల్లిస్తున్న కిస్తులు, మహి ళాభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు చేయాల్సి ఉంటుంది. అయితే, గోల్మాల్ ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్నా.. వారు కిమ్మనకుండా ఉండడానికి కార ణమేంటి..? బ్యాంక్ అధికారులు ఓ చిన్న అక్షరం పొర పాటు పడితేనే సవాలక్ష కారణాలు చెబుతూ బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటుంటారు..! మరి ఓ మహిళ చెబితే ఇన్ని సంఘాలకు ఇంత మొత్తం ఎలా రుణాలు మంజూరు చేశారు..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
తప్పుని తేలితే చర్యలు తీసుకుంటాం..
లీడ్ బ్యాంక్ మేనేజర్ కల్వ భాస్కర్‌ను వివరణ కోర గా.. బ్యాంక్ లింకేజీ రుణాలకు సంబంధించి స్వయం స హాయక సంఘాల సభ్యులతో కచ్చితంగా ఒకటికి రెండు పర్యాయాలు మాట్లాడి.. సంఘం తీర్మాణంతోనే రుణాలు ఇవ్వాలని తెలిపామన్నారు. చనిపోయిన మహిళ పేరిట రుణమెలా ఇచ్చారని అడగగా.. ‘డాక్యుమెంటేషన్ అ య్యాక ఆమె చనిపోయి ఉండొచ్చు.. ఈ విషయాలపై సమగ్ర వివరాలు సేకరిస్తాం. అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు చేపడతాం’ అని పేర్కొన్నారు. కోయనగర్ సీవోకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈమె పేరు వడ్ల కళావతి. మహ బూబ్‌నగర్ మున్సిపాలిటీలోని కో యనగర్కు చెందిన ఆమె సాయి మ ణికంఠ మహిళా సంఘం లో సభ్యు రాలు. అయితే, అనారోగ్యం బారిన పడగా.. హైదరాబాద్ ఈఎస్ఐ ద వాఖానలో చికిత్స పొందుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన మృతి చెందింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన (ఆమె చని పోయిన రెండు నెలల తర్వాత) మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదుట ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (అగ్రికల్చర్ కమర్షియల్ బ్రాం చ్)లో రుణం తీసుకు న్నట్లు లావాదేవీల్లో నమోదైంది.