Tragedy | పెళ్లింట విషాదం.. ఈతకు వెళ్లి బాలుడు మృతి
Tragedy | స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన పెళ్లింట విషాదం నెలకొంది.
ఊట్కూర్(కృష్ణ) : స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన పెళ్లింట( Wedding ) విషాదం నెలకొంది. నారాయణపేట( Narayanapet ) జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన చెరువు కట్ట అశోక్ పెళ్లి సోమవారం జరగాల్సి ఉండగా మహారాష్ట్ర సోలాపూర్ పట్టణం నుంచి బంధువులు రెండు రోజుల క్రితం గ్రామానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లి సందడి లో ఉండగా తన్మై (13) సంవత్సరాల బాలుడు స్నేహితులతో కలిసి ఊరి శివారులో ఉన్న వ్యవసాయ బావి దగ్గరకు ఈతకు వెళ్లాడు. బాలుడికి ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఊపిరి ఆడక చనిపోయినట్లు బంధువులు తెలిపారు.
బాలుడు మృతి చెందిన సంఘటనతో పెళ్లి భాజాలతో కళకళలాడాల్సిన పెళ్లి పందిరి మూగబోయింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా బాధిత కుటుంబ సభ్యులు బాలుడి శవంతో సోలాపూర్ పట్టణానికి తిరుగు ప్రయాణం అయినట్లు సమాచారం .
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- Boy Drowns
- Swimming
- tragedy
- Utkoor
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

