హన్వాడ, ఫిబ్రవరి 28 : రోజురోజుకు మార్కెట్లో టమాట ధరలు పడిపోవడంతో టమాట పంటలు సాగు చేసిన రైతులు కష్టాల్లో పడ్డారు. కొద్దిపాటి నీటి సదుపాయం ఉన్న రైతులు కూరగాయాల పంటలు సాగు చేసుకుంటే పంట చేతికి వచ్చే సారికి ధరలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 25కేజీల టమాట బాక్స్‌కు రూ.130 ఇస్తున్నారు.
మార్కెట్లో అమ్ముకుంటే కేజీ రూ.10 విక్రయిస్తున్నారు. వేల రూపాయలు ఖర్చు చేసి పంట చేస్తే ధరలు లేకపోతే రైతులు నష్టపోతున్నామని వాపోతున్నారు. ఆటో కిరాయితోపాటు కూలీ డబ్బులు కూడా రావడంలేదన్నారు. దీంతో టమాటలు తెంచకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు. మండలంలోని టం కర, దచ్చక్పల్లి, కోత్తపేట, గుడ్డిమల్కాపూరం తదితర గ్రామా ల్లో రైతులు పెద్దు ఎత్తున్న టమాట సాగు చేశారు.