నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 24 (నమ స్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేసేందుకు, నా యకులు, కార్యకర్తల్లో జోష్ నింపేందు కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నా రు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సి ట్టింగ్ స్థానం నిలబెట్టుకోవడమే లక్ష్యం గా అచ్చంపేట, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ జిల్లా అధ్యక్షు డు గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సమీక్షా సమావేశాల్లో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయనున్నారు.
నేడు సమీక్షా సమావేశాలు..
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ కదులుతున్నది. వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశంతో పార్లమెంట్ స్థానాలను గెలిపించేందుకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ దఫా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేసేందుకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల ఆధ్వర్యంలో అచ్చంపేటలో, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నా గర్‌కర్నూల్ సమావేశాలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రా ష్ట్రంలో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచేలా వ్యూహాలు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానంలో ప్రస్తుతం పి.రాములు సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ తరఫున కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మరోసారి నాగర్‌కర్నూల్ స్థానా న్ని కైవసం చేసుకునేలా పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
కాంగ్రెస్‌పై సన్నగిల్లుతున్న నమ్మకం..
అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై ప్రజల్లో ఇప్పటి కే చాలా వరకు విశ్వాసం సన్నగిల్లింది. పదేండ్లపాటు పాలించిన బీఆర్ఎస్ నా యకత్వం, పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. దీనికితోడు ఇప్పటికే కాంగ్రెస్‌లో టికెట్ల కుమ్ములాట మొదలైంది. కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య చాంతాడంత ఉన్నది. పాతికమందికిపైగా టికెట్లను ఆశిస్తున్నారు. మల్లురవి, సంపత్‌కుమార్, మందా జగన్నాథ్, తదితరుల మధ్య టికెట్ల పంచాయితీ కాం గ్రెస్ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నది. టికెట్ కోసం మల్లురవి ఏ కంగా ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఇక బీజేపీలో అభ్యర్థులే కరువయ్యారు. ఇంతకు ముందు పోటీ చేసిన బంగారు శృతి ఒక్కరే అడపాదడపా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో అదే నమ్మకం కొనసాగుతున్నది. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో క్ర మశిక్షణతో పార్టీ సూచించిన అభ్యర్థి బరిలో ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఇది పార్టీ కార్యకర్తలకు గందరగోళానికి తావు లేకుండా చేయనున్నది. పార్లమెంటరీ పరిధిలో ఆయా పార్టీలు, ఇతర సంస్థలు చేపట్టిన సర్వేల్లోనూ బీఆర్ఎస్ బలంగానే ఉండి, గెలుస్తుందని తేలుతున్నది. ఇది పార్టీకి ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని తె లియజేస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ ఓట్లను కారు పార్టీ సాధించిం ది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశాలు పార్టీ శ్రే ణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే మర్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు.