అచ్చంపేట, ఆగస్టు 8 : కొండకోనలను ఆవాసంగా చేసుకొని ప్రకృతి మధ్య స్వేచ్ఛగా జీవనం గడుపుతున్న ఆదివాసీల జీవనశైలి స్వరాష్ట్రంలో క్రమంగా మారుతున్నది. అనాదిగా అడవితల్లినే నమ్ముకొని ప్రకృతిలో లభించే అటవీ సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నారు. కొండలు, గుట్టలు, బొడ్డు గుడిసెలు, గుంపుచెట్లను నివాస ప్రాంతాలుగా చేసుకొని తరతరాలుగా వాటిపై ఆధారపడి నివసిస్తున్న మూలవాసులు. సమైక్య రాష్ట్రం లో అన్ని వర్గాల మాదిరిగానే ఆదివాసీలు కూడా నష్టపోయారు. అప్పటి ప్రభుత్వాలు, పాలకులు పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదు. వారికి జీవన సదుపాయా లు, కనీస వసతులు కల్పించలేని దుస్థితిలో దుర్భర జీవితాన్ని గడిపారు. వైద్యం అందక ప్రాణాలు వదిలా రు.
దీంతో క్రమంగా సమాజంలో అన్నివర్గాల జనాభా పెరుగుతుంటే చెంచుల జనాభా తగ్గుకుంటూ వచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో సున్నిపెంటలోని ఐటీడీఏను తెలంగాణ ప్రాంతంలోని చెంచులకు అందుబాటులో ఉండేందుకు అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో ఐటీడీఏ ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం సమకూరుస్తోంది. జీవనోపాధి, రవాణా వ్యవస్థ మెరుగుపర్చడం, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే మహాశివరాత్రి సందర్భంగా నల్లమల దట్టమైన అటవీప్రాంతంలో భౌరాపూర్ ఆదివాసీల జాతరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి ప్రతి ఏడాది ని ర్వహిస్తోంది.
చెంచులకు కావాల్సిన ప్రభుత్వ పథకాలు, విద్య, వైద్యంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అన్ని వర్గాల కన్నా ఆదివాసీ చెంచుల సంక్షే మం, అభివృద్ధిపై ఇప్పటి ప్రభుత్వం మరింత దృష్టి పె ట్టాల్సిన అవసరం ఉంది. అనాదిగా చెంచు పెంటలను పీడిస్తున్న తాగునీటి సమస్యను చెక్ పెట్టేందుకు ప్రభు త్వం ప్రత్యేకంగా ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్లు అం దించేందుకు గత ప్రభుత్వం రూ.6 కోట్లు ఖర్చుపెట్టిం ది. అన్ని పెంటలకు సోలార్ ద్వారా సింటెక్స్ ట్యాంకు లు పెట్టి బోర్లు ద్వారా ఇంటింటికీ పైపులైనన్ వేసి తాగునీటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పైపులైన్ లీకేజీ కారణంగా తాగునీటి సమస్య పెంటలను పీడీస్తోంది.
రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కులు కల్పించాల ని నేటికీ ఆదివాసీలు ఉద్యమాలు చేస్తున్నారు. ఇటీవ ల మరోసారి అసెంబ్లీ వరకు పాదయాత్ర ప్రారంభించిన ఆదివాసీలు మన్ననూర్‌కు చేరుకోగానే పోలీసులు ని ర్భంధించి అనుమతిలేదని నిలిపివేశారు. ఐటీడీఏ అధికారులు చర్చలు రెండునెలల్లో సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో పాదయాత్ర తాత్కాలికం గా నిలిపివేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఐటీడీఏ ద్వా రానే కల్పించాలి. జనరల్‌లో కలుపొద్దని చెంచులు కోరుతున్నారు. ప్రతి చెంచు నిరుపేద కుటుంబానికి అంత్యోదయ కార్డులు అందజేయాలి.
పీసా చట్టం, అటవీహక్కుల చట్టం 2006 గురించి షెడ్యూల్ ఏరియాలో పనిచేస్తున్న ప్రతిశాఖలోని అధికారులకు ప్రభుత్వం అవగాహన కల్పించాలి. ప్రతిచెంచు గూడానికి రోడ్డు, కరెంట్, తాగునీటి సౌకర్యం కల్పించాలి. ఇల్లులేని కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. అటవీఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు పెంటలను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి. గిరిజన కార్పొరేషన్లో నామినెటేడ్ పోస్టు చెంచులకు ఇవ్వాలి. టైగర్ ట్రాకర్స్‌ను రెగ్యూలర్ చేయాలి. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి అటవీ అధికారుల వేధింపులు లేకుండా చూడాలి. భూమిలేని కుటుంబానికి భూమి ఇవ్వాలి. పీసా తీర్మానాలు గౌరవించి అమలు చేయాలి. మహిళా సంఘాలకు ట్రాక్టర్ ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.
నల్లమల అటవీప్రాంతంలో ఆదివాసీలు పొట్టిగా, సన్నగా, నల్లగా, ఉంగరాల జట్టు కలిగి ఉంటారు. ప్ర తి కుటుంబం వంశపారపర్యంగా ఒక భూభాగానికి అధిపతులుగా ఉండి జీవిస్తారు. దట్టమైన అటవీప్రాంతంలో జీవించే చెంచులకు మాత్రం సంపాదనపై ఆస క్తి ఉండదు. ఏరోజుకారోజు పూట గడిపేందుకు ఆసక్తి చూపుతారు. అటవీ ఉత్పత్తులు సేకరించి జీసీసీలో వి క్రయించి వాటితో వచ్చిన డబ్బులతో నిత్యావసర స రుకులు కొనుగోలు చేసి జీవిస్తారు. అడవిలో లభించే పండ్లు, ఆకులు, వనరులను ఆహారంగా తీసుకుంటా రు. సీజనల్ వారీగా లభించేవాటినే ఆహారంగా తీసుకొని కాలం గడుపుతారు.
చెంచులు ఎక్కువగా బ య్యన్న, పోతురాజు, లింగమయ్య, నాగమ్మ, పెద్ద మ్మ, ఎల్లమ్మ, భౌరమ్మ, మల్లమ్మ, లక్ష్మమ్మ, మైస మ్మ, గొవుల మైసమ్మ, గారెల మైసమ్మ, ఆంకాళమ్మ తదితర దేవతలను పూజిస్తారు. తమ అడవిలో ఉండే జంతువులనే దేవతలుగా భావిస్తారు. పెద్దపులిని పెద్దమ్మతల్లిగా, ఎలుగుబంటిని లింగమయ్యగా, అడవిపందిని మైసమ్మతల్లిగా, పాముని ఎల్లమ్మ, నాగమ్మ గా, నల్లబోతు జంతువు- పోతురాజుగా, అడవి రేసుకుక్కలు-భౌరమ్మతల్లిగా ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. తేనె తీసే క్రమంలో తేనె తెట్టులో ఉండే తెల్లని తేనేగడ్డను మల్లమ్మ దేవతగా నమ్ముతారు. చెంచులు ప్రతి గుడిసె, కుటుంబంలో తప్పనిసరిగా శునకాన్ని పెంచుతారు. ఈ శునకాన్ని భౌరమ్మగా భావించడంతోపాటు చీపురుతో కొట్టడం, కాళ్లతో తన్నడం లాం టివి చేయరు.
వేటకు వెళ్లేటప్పుడు శునకంతోపాటు భార్యాభర్తలు కలిసి వెళ్తారు. వేట సమయంలో సమీపంలో పులి, చిరుతపులి, ఎలుగుబంటి లాంటివి ఉం టే శునకం సూచన చేస్తుంది. దీంతో వేటకు వెళ్లిన చెం చులు ప్రమాదమని గ్రహించి అటువైపు వెళ్లకుండా ఇతర ప్రాంతానికి వెళ్తారు. వారి కట్టుబాట్లు ప్రత్యేకం గా ఉండడంతోపాటు ఇంటిపేర్లు ప్రత్యేకంగా ఉంటా యి. నల్లపోతులు, నిమ్మల, డంసాని, చిగుర్ల, మండ్లి, పిట్టల, చిర్ర, కనుమోని, తోకల, ఉడుతనూరి, కాట్రా జు, బల్మూరి, దాసరి, శీలం, పులిచెర్ల, బూమని, ఉ డుతల, ఉడుతనూరి తదితర 30రకాల వరకు వీరి ఇంటి పేర్లు ఉంటాయి. వీరిలో నిమ్మల, నల్లపోతుల ఇంటివారు అందరినీ పెళ్లి చేసుకోవచ్చు. వీరి పిల్లల ను మిగిలిన వాళ్లు పెళ్లి చేసుకోవచ్చు.