వసంతుని వలపు గీతాలు.. కోకిలమ్మ కుహుకుహు రాగాలు.. మామిడాకుల మంగళనాదాలు.. వేపపూల వగరు భాష్యాల సమ్మేళనం.. శిశిరం అదృశ్యమవుతూ.. వసంతా గమన వేళ తెలుగు వారంతా ఇంటిల్లిపాది జరపుకొనే కాలాలకు సంబంధించిన తొలి పండుగ ఇది.. తెలుగువారికి ఉగాదిగా.. కన్నడిలకు యుగా దిగా.. మహరాష్ట్రీయులకు గుడిఫడ్వాగా.. సిక్కులకు వైశాకిగా.. తమిళులలకు ఉత్తాండుగా.. మళయాలీలకు విషుగా.. బెంగాళీలకు పోయిలాబైషాట్.. ఇలా ఆయా రాష్ర్టాల్లో ప్రజలు జరుపుకొనే పండుగ ఉగాది.. అంతటా ఒక్కటే భావన అదే ఆశావాహు దృక్పథం, నిస్సాయ నిరాశలను విడనాడి శ్రీవిశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఆశలతో భవిష్యత్ శ్రీపరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం..
– గద్వాలటౌన్, మార్చి 18
కొత్త సంవత్సంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణ ఫలితాన్ని తెలుసుకుంటారు. తద్వారా గంగస్నానం చేసినంత పుణ్యం పొందవచ్చునని పెద్దలు చెప్తారు. పూర్వ కాలంలో పంటలు ఎలా పండుతాయి, ఏ రకం పంటలు వేస్తే బాగుంటుందని లాభాలు ఎలా ఉంటా యన్న వాటిని పంచాంగం ద్వారా తెలుసుకొని సాగు చేసేవారు. ప్రస్తుతం కూడా కొందరు వ్యవసాయ దారులు అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ ఏడాది ఉగాదితో శ్రీపరాభవ నామ సంవత్సరం ఆరంభమవుతుంది. దేశమంతటా నూతన శాఖలను అందించే పర్వదినమే ఈ ఉగాది. నిత్యావసరాల కోసం అందరూ ఇంగ్లిష్ క్యాలెండర్ గ్రిగేరియన్ క్యాలెండర్ను ఉపయోగిస్తున్నా హిందూ సంప్రదాయ ప్రకారం శుభకార్యాలు, పూజలు, వ్రతాలు, ఉత్సవాల వంటి పవిత్ర కార్యాలయాలు, విశేషాలకు వచ్చే సరికి పంచాంగాన్నే వాడుతుంటారు. అటువంటి పంచాంగం ఈ ఉగాది పండుగతో అమలులోకి వస్తుంది. పంచాంగాన్ని ఉగాది నాడు దేవతలతోపాటు పూజించాలని శాస్ర్తాలు చె బుతున్నాయి. అంతేగాక పంచాంగ శ్రవణం ఉగాది విధుల్లో ఒకటి. గ్రామాలు మొదలుకొని పట్టణాలు, పెద్ద నగరాల్లో ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు తెలుసుకుంటారు. అలాగే పండుగ పూట గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. రైతన్నల తొలి పండుగ ఉగాది దుక్కిదున్నితే ఆ ఏడాది అంతా కలిసి వస్తుందనే భావనతో దుక్కులకు ముహూర్తాలు పెడతారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఈ ఏడాది అంతా శుభమే కలగాలని కోరుకుంటారు.
సృష్టి ప్రారంభానికి బ్రహ్మదేవుడు నిర్ణయించిన సుముహూర్థం ఉగాది అని నిర్ణయ సింధు చెప్తోంది. యుగాల ప్రారంభానికి ఆదిగా నిలిచే వేడుక అయినందున కాలగమనంలో యుగాదే ఉగాదిగా రూపాంతరం చెందిందని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది నాడే శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించడాని, శ్రీరాముడి కల్యాణోత్సవాలు కూడా ఉగాది నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్నది. త్రేతా యుంగంలో శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది కూడా ఉగాది నాడే కావడం విశేషం. అలాగే శకారాంభకుడు, శాలివాహనుడు కీరిటి దారులైంది కూడా ఉగాదినాడే. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవుల అగ్రజుడు ధర్మరాజు హస్తినాపురానికి రాజైంది ఉగాది రోజునే కావడం మరో విశేషం. అలాగే వేదాల ను హరించిన సోమకుని వధించి మత్స్యావతారాధారియైన విష్ణువు వేధాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణ పురస్కరంగా విష్ణువు ప్రీత్యార్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాఢ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడనేది మరో ప్రతీతి.
ప్రతి పండుగలో ఏదో ఒక వంట కం ప్రత్యేకంగా చేసుకోవడం తెలుగువారి సంప్రదాయం. అలంకరణలు, వంటకాలు ప్రతీది ఆనందోత్సవాలతో ఇంటిళ్లిపాది జరుపుకొంటారు. ముఖ్యంగా ఈ ఉగాది పండుగనాడు షడ్రుచుల పచ్చడిని తయారు చేసుకుని ఇంటిల్లిపాది సేవించడమేకాక ఆత్మీయులకు, అతిథులకు అందిస్తుంటారు. పచ్చడి సంప్రదాయానికి ప్రతీకనే కాక పచ్చడిలో ఆరోగ్యం కూడా దాగి ఉంది. పచ్చడి తయారీలో వేపపూత, పచ్చిమామిడి ముక్కలు, కొత్త చింతపండు, బెల్లం, ఉప్పు, కారం, మిరియా లు ఇలా దేనికదే ప్రత్యేకతను కలిగి ఉండి ఎన్నో రోగాలను నయం చేస్తాయి. ఆరు రుచులు వీటిని కొత్త కుండలలో కలిపి నిల్వ చేసి సేవించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
బెల్లం.. తీపి- ఆనందానికి సంకేతం.
ఉప్పు.. జీవితంలో ఉత్సాహం, రుచికి..
వేప పువ్వు.. చేదు-బాధ కలింగించే అనుభవం
చింతపండు.. పులుపు-నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు.
పచ్చిమామిడి.. వగరు- కొత్త సవాళ్లు.
కారం.. సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు.