నాగర్‌కర్నూల్ (నమస్తే తెలంగాణ)/వనపర్తి టౌన్/మహబూబ్‌నగర్ టౌన్/రేవల్లి, ఏప్రిల్ 21 : ముస్లింల పవిత్ర పండుగ రంజాన్. నెలరోజులు అత్యంత భక్తిశ్రద్ధలు, నియమనిష్టలతో చేపట్టిన ఉపవాస దీక్షలు శుక్రవారంతో ముగియనున్నాయి. దీం తో శనివారం రంజాన్ పండుగను గ్రామాలు, పట్టణాల్లో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. నెలవంక కనిపించిన గతనెల 23నుంచి రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ముస్లింలు అత్యంత కఠిన ఉపవాస దీక్షలను పాటించారు. తెల్లవారుజామున సహార్, సాయంత్రం ఇఫ్తార్లకు మాత్రమే పరిమితమయ్యారు. మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా అల్లాహ్ చింతనలో గడుపుతూ వచ్చారు. మానవాళికి ముక్తిమార్గం చూ పించేందుకు అల్లాహ్ పంపిన పవిత్ర ఖురాన్ గ్రం థం అవతరించిన మాసం కావడంతో ఈ గ్రంథం పఠనానికి ప్రాధాన్యత ఇచ్చారు. తీవ్రమైన ఎండ లు, ఉక్కపోతలు ప్రభావం చూపిస్తున్నా రోజూ ఐ దుసార్లు నమాజ్ చేస్తూ, తమకు ఉన్నదాంట్లో పేదలకు దాన ధర్మాలు చేశారు. ఈ ఉపవాస దీక్ష మనిషిలోని చెడు భావాన్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతుందని ముస్లింల నమ్మకం.
ఈ మాసంలో చనిపోతే నేరుగా స్వర్గానికి వెళ్తారని భావిస్తారు. అలాంటి పవిత్ర ఉపవాస దీక్షలు నెల రోజులు ముగిశాక శనివారం రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. ఇక సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు రంజాన్ తోఫాలో భాగంగా దుస్తులను అందించింది. అలాగే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు సైతం ఇవ్వడం గమనార్హం. అలాగే పలువురు సైతం ము స్లింలకు ఇఫ్తార్లు ఏర్పాటు చేసి సర్వమత సమ్మేళనాన్ని చాటుకొన్నారు. ఇక ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇక ఈ మాసం లో ముస్లింలతో పాటుగా హిందువులందరూ ఇష్టపడే హలీం, హర్రీస్ వంటకం రుచులను కూడా అందరూ చూశారు. రుచితో పాటుగా మంచి ఆరోగ్యకరమైన హలీం రుచులూ ఇక దూరం కానున్నాయి. కాగా పండుగ ఏర్పాట్లకు ఆయా మున్సిపాల్టీలు, గ్రామాల్లో అధికారులు ముస్లిం మత పెద్ద లు, ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాట్లు చేశారు. ప్రార్థనలు చేసేందుకు ఈద్గాల వద్ద చదును చే యడం, నీళ్లు, టెంట్లలాంటి ఏర్పాట్లు చేపట్టారు. ఈ వేడుకలకు భారీగా ముస్లింలు హాజరవుతారు. అ లాగే ఎమ్మెల్యేలు, ఇతర హిందూ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు చెబుతారు. ఈ కారణంగా పోలీసులు సైతం బందోబస్తు ఏర్పాట్లు చేపట్టనున్నారు. ముస్లింలు శుక్రవారం సాయంత్రం దీక్షలు విరమించి శనివారం రంజాన్ జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం రాత్రి మగ్రీబ్ నమాజ్ అ నంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ తెలుపుకొన్నారు. శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని క్లా క్టవర్, న్యూటౌన్ తదితర ప్రాంతాల్లో ముస్లింలు షాపింగ్ చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వానగుట్టలో ఉన్న రహెమాని ఈద్గాలో ఉదయం 9 గంటలకు ఈద్ నమాజ్ ఆచరించనున్నారు. మదీన మసీద్‌లో 8:30కు, సిరాజుల్ ఉలుమ్లో ఉదయం 7 గంటలకు ఈద్ నమాజ్ ఉంటుంది. రంజాన్ పండుగను పురస్కరించుకొని ఎ క్సైజ్, క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్ శుభాకాంక్షలు తెలిపారు. శనివా రం ఉదయం ఈద్గా వద్దకు మంత్రి, ఎం పీ, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ దర్శించనున్నారు. పురపాలిక శాఖ ఆధ్వర్యంలో ఈద్ నమాజ్ కోసం ఏర్పాట్లు చేశా రు. వనపర్తి జిల్లా కేంద్రంలోని గోపాల్పేట రోడ్డులో ఉన్న ఈద్గాను మున్సిపల్ అధి కారులు శుభ్రం చేశారు.