హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో గురువుకు అగ్రతాంబూలం ఇచ్చారు.. తల్లిదండ్రుల తర్వాత ఆయన్నే ఎక్కువగా పూజిస్తారు.. సాక్షాత్తు పరబ్రహ్మతో సమానంగా గౌరవిస్తారు.. శ్రీరామచంద్రుడు అంతటి వాడే గురువుతో విద్యనభ్యసించాడంటే ఆ స్థానానికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది.. గురువు లేనిదే జగత్తు లేదన్నది అక్షర సత్యమని చెప్పక తప్పదు.. అంతటి ప్రాధాన్యత ఉన్న గురువును కొలిచేందుకూ ఓరోజు ఉందండోయ్.. అదే గురుపౌర్ణమి.. దీనినే వ్యాసపౌర్ణమి అని కూడా పిలుస్తారు.. అందుకే నేటితరం గురువును ఆరాధ్య దైవంగా కొలుస్తూ తరిస్తున్నారు.. అందులో వేదవ్యాసుడు.. గురు దత్తాత్రేయుడు.. గురురాఘవేంద్రస్వామి.. షిర్డీ సాయిబాబా.. ఇలా ఎందరినో పలువురు ఆరాధిస్తున్నారు.
గురు అనే సంస్కృత పదంలో గు అంటే అజ్ఞానమనే చీకటి అని.. రు అంటే తొలగించే వాడని.. అంటే అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడు గురువని అర్థం. అష్టదశ పురాణాలను భావి తరాలకు అందించిన వా డు వ్యాసుడు. వ్యాస మహర్షి జన్మించింది ఆషాఢ శుద్ధపౌర్ణమి నాడు. అందుకే ఈ పౌర్ణమిని వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. బడుల్లో పాఠాలు చెప్పే వారిని మాత్రమే గురువుగా సంభోదించడం పరిపాటి. కానీ సిద్ధపురుషులను, కారణ జన్ములను, జీవిత సారాన్ని అందించిన వారిని మాత్రమే గురువులుగా భావిస్తా రు. అందుకు వ్యాస మహర్షి నిదర్శనం.
మహాభారత రచనల ద్వారా జగద్గురువుగా ప్రసిద్ధి చెందారు వ్కాస మహర్షి. వేదాలను విభజించి వేద వ్యాసుడుగా కీర్తి గడించారు. అజ్ఞానమనే అంధకారం తొలగించే విజ్ఞానమనే వెలుగును ప్రసాదించే వారు సద్గురువు అటువంటి సద్గురువులకు గురువుగా వ్యాసమహర్షి నిలిచారు. ఆయన ఉన్నతిని మననం చే సుకుంటూ మహర్షి జన్మించిన ఆ షాఢ పూర్ణిమ రోజు వ్యాస భగవానుడి జయంతిని గురుపౌర్ణమి పే రుతో నిర్వహించుకోవడం ఆనవాయితీ. అదే ఆనవాయితీని నేటికీ కొనసాగిస్తున్నారు.
వేద వ్యాసుడు నుంచి గురు రాఘవేంద్రుడి వరకు, దత్తాత్రేయుడు నుంచి సాయిబాబా వరకు, ఆదిశంకరాచార్య నుంచి రమణ మహర్షి వరకు ఇలా ఎందరో సద్గురువులు జనాల్లోని అజ్ఞానాన్ని తొలగించి వెలుగు నింపేందుకు సద్గురువు వేద మహర్షి బాటలో పయనించిన వారే. వారందరినీ మననం చేసుకుంటూ గు రుపౌర్ణమి నాడు గురుసేవ చేయడం సముచితం. అం దుకే ఎవరికి ఇష్టమైన గురువును.. కానీ గురువులా భావించే వారిని కాని కొలవడం అనాథిగా వస్తున్నది.
సంస్కారం నేర్పడమే కాదు ఆచరించేలా శిష్యుడి మనసును నియంత్రించే విధాత గు రువు. గురువును గౌరవించినప్పుడే శిష్యుడికి ఉన్నతి లభిస్తుందని పురాణాలు చెబుతున్నా యి. గురువులు కూడా ధనార్జనే విద్యకు పరమార్థమనే భావనతో కాకుండా నైతిక విలువలను నేర్పించేలా గురువులు కూడా కృషి చేయాలనేదే గురుపౌర్ణమి పరమార్థమని పండితులు చెబుతున్నారు.
గురుపౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం సా యి మందిరాలతోపాటు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే నదీఅగ్రహారంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవా న్ని నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాఘవేంద్రస్వామి మఠంలో, భూలక్ష్మిచెన్నకేశవస్వామి ఆయంలో పౌర్ణమిని పురస్కరించుకొని సత్యనారాయణస్వామి సా మూహిక వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.