నాగరికత ఎంత ముందుకు సాగినా.. సైన్స్ ప రంగా ఎంత అభివృద్ధి సాధించినా.. నాగలి లేనిదే పని జరగదు.. దుక్కి దున్నందే తినడానికి తిండి దొ రకదు.. రైతు లేనిదే పూట గడవదు.. పట్టెడన్నం పు ట్టదు.. జాతికి వెన్నెముకగా నిలిచిన రైతన్నలు జరుపుకొనే పండుగే ఏరువాక పౌర్ణమి.. ఈ వేడుకను ఘనంగా జరుపుకొనేందుకు నడిగడ్డ ప్రాంత రైతు లు, ప్రజలు సిద్ధమయ్యారు.
– గద్వాల టౌన్, జూన్ 21
వ్యవసాయదారులు(రైతులు) ఏరువాక పండుగ ను జేష్ఠ్య పౌర్ణమి నాడు జరుపుకుంటారు. తెలుగు సం వత్సరంలో జేష్ఠ్యమాసం అంటే మూడో నెల. ఈ నెల మొదటి పక్షంలో రోహిణికార్తె తరువాత మృగశిర కార్తె వస్తుంది. ఈ కార్తెలో ఎండల ప్రభావం తగ్గి ముంగిళ్లు చల్లబడతాయన్న నానుడి ఉన్నది. అంతేకాదు జ్యేష్ఠపౌర్ణమి నాటికి తొలకరి పలుకరించక మానదు. ఇందుకు కృతజ్ఞతాపూర్వకంగా జరుపుకొనే పండుగను కృషి పూ ర్ణిమ, మాల పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ అంటారు. ఏ రువాక అంటే నాగలితో దుక్కి ప్రారంభించడమన్న అ ర్థం ఉంది. ఆరుగాలం పొలాల్లో తమతోపాటు శ్రమిం చే పశువులను ఏరువాక నాడు పూజిస్తే కాలం కలిసొస్తుందని నమ్మకం. అందుకే రైతులు ఏరువాకను ఓ సంప్రదాయ పండుగగా జరుపుకొంటారు.
నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠం అని జ్యోతిష్యశాస్త్రం చెబుతున్నది. ఈ నక్షత్రం చంద్రుడు కూడి ఉండే రోజు కావడం ఎంతో విశేషం. చంద్రుడు ఓషదులకు అధిపతి. ఓషదులు అ నగా మంచు, ఎరువు, సూక్ష్మధాతువులు అని అర్థం. ఇవన్నీ ఉంటేనే వ్యవసాయం ఫలసాయాన్ని ఇస్తుంద న్న నమ్మకంతో జ్యేష్ఠపౌర్ణమి రోజునే వ్యవసాయ పను లు ప్రారంభిస్తారు.
ఆరుగాలం కష్టించే రైతన్నలకు తోడుగా వారి కష్టా ల్లో భాగం పంచుకుంటూ అన్ని విధాలా అండగా ఉం డే పశువులకు ఏరువాక పౌర్ణమి రోజు గ్రామాల్లో ఉదయాన్నే చెరువులు, కుంటల వద్దకు తీసుకెళ్లి స్నానాలు చేయించి వాటి కొమ్ములకు రంగులను పూస్తారు. కాళ్లకు గజ్జెలు, మెడలో గంటలు, కుచ్చులు కట్టి శరీరం నిండా రంగులు అద్దుతారు. ఆర్థిక స్థోమత ఉన్న రైతులు ఎద్దులను నూతన వస్ర్తాలతో అలంకరించి ఇంట్లో ఉన్న గాటి వద్దకు తీసుకొస్తారు.
పండు గ సందర్భంగా చేసిన పొంగలిని నైవేద్యంగా పెట్టి ఆ గాటికి దూప, దీపాలతో పూజలు చేసి చల్లంగా చూడమని వేడుకుంటారు. సాయంకాలం మంగళవాయిద్యాలతో ఊళ్లో ఉన్న పశువులన్నింటినీ ఒక దగ్గరకు చే రుస్తారు. అక్కడి నుంచి పశువుల ఊరేగింపు ప్రజల కే రింతల మధ్య కనుల పండుగగా సాగుతుంది. ఎద్దులతోపాటు నాగలిని ఎర్రమట్టి, చున్నం పట్టెలతో అలంకరించి పొలం వద్దకు వెళ్తారు. ఈ ఏడాది రైతు కుటుంబంలో ఎవరి పేరుపైన బలం ఉందో వారు దుక్కిని దు న్ని పొలం పనులు ప్రారంభిస్తారు.
దుక్కి దున్నడానికి వెళ్లే ముందు ఊరి పొలిమేరలో పుంటి నారతో తోరణాన్ని కడతారు. ఆ తోరణానికి రూపాయలు, జిలేబీలు, గారెలు, గజ్జెలు తదితర వస్తువులను రైతులు అలంకరిస్తారు. వాటిని చెర్నకోలతో కొ డుతూ ఎవరికి దొరికిన వస్తువును వారు తీసుకెళ్తుంటా రు. ఈ విధంగా చేయడం వల్ల పశువులకు మేలు కలుగుతుందని రైతుల నమ్మకం. దీనినే ఏరువాక తాడు తెంచడం అ ని అంటారు. ఈ ఆచారా న్ని, పండుగను విష్ణు పురాణంలో సీత య జ్ఞంగా పిలువబడేదని ప్రతీతి.
ఏరువాక పండుగను ఘనంగా నిర్వహించేందుకు నడిగడ్డ ప్రజలు సన్నద్ధమవుతున్నారు. దీంతో శుక్రవారం జిల్లా కేంద్రం గ్రామాల ప్రజలతో కిక్కిరిసి పో యింది. ఉత్సవాలకు సంబంధించిన వాటిని కొనుగో ళ్లు చేయడంలో నిమగ్నమయ్యారు. గ్రామ దేవతలకు సమర్పించేందుకు సంత రోజు కాకపోయిన కోళ్ల కొనుగోళ్లు కూడా జోరుగా సాగింది. అలాగే గ్రామ దేవతలై న సుంకులమ్మ, ఈదమ్మ అమ్మవార్ల ఆలయాలను ముస్తాబు చేశారు. చింతలపేటలో ఏరువాక తాడు తెంచే ఉత్సవం, ఎద్దుల ఊరేగింపునకు కావాల్సిన ఏర్పాట్లను నిర్వాహకులు చేస్తున్నారు.