గద్వాల, ఫిబ్రవరి 16 : సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్డీఎస్ రైతాంగానికి సాగునీరు అందక తీవ్రంగా నష్టపోతున్నా ఇక్కడి పాలకులు పట్టించుకోలేదు. పైగా నడిగడ్డ ప్రజలను, రైతులను ఎండబెట్టిన ఇక్కడి నేత ఆంధ్ర నాయకుల వద్దకు వెళ్లి హారతులు పట్టారు. ఆర్డీఎస్ కింద వాస్తవంగా నడిగడ్డ రైతులకు 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఏనాడూ 35వేల ఎకరాలకు మించి నీరు పారలేదు. ఈ విషయం బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు దృష్టికి నడిగడ్డ రైతులు తీసుకెళ్లారు. అందుకు చలించిపోయిన కేసీఆర్ నడిగడ్డ ఆర్డీఎస్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి 2004 జూన్ 10వ తేదీన అలంపూర్ నుంచి 8రోజులు పాదయాత్ర చేశారు. రైతుల సమస్యలు విన్న కేసీఆర్ సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటం తప్పదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నడిగడ్డ ప్రజల కోరిక నెరవేర్చుతానని చెప్పారు.
ఆర్డీఎస్ రైతుల చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తానని మాట ఇచ్చారు. అవసరమైతే ఆర్డీఎస్ ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకొని కూర్చొని నడిగడ్డ రైతులను కాపాడుకుంటానని, చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తానని చెప్పారు. రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో రా గానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ ఆర్డీఎస్ ప్రాజెక్టు నుంచి మనకు వచ్చే నీటివాట ను తీసుకుంటూనే రైతులకు రెండు పంటలకు నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని భావించి తుమ్మిళ్ల లిఫ్ట్ పనులకు శ్రీకారం చుట్టారు.
పనులకు శ్రీకారం చుట్టిన ఏడాదిలోపే తుమ్మిళ్ల లిఫ్ట్ పనులు పూర్తి చేసి ఆర్డీఎస్ రైతుల చివరి ఆయకట్టుకు నీరు అందించారు. నాడు పాదయాత్రలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నడిగడ్డ రైతుల కళ్లలో ఆనందం నింపారు. ఇది ఎప్పటికీ నడిగడ్డ ప్రజలు మరచిపోలేని సంఘటనగా గు ర్తుండి పోయింది. గత కాంగ్రెస్ పాలకులకు ఎన్నికల నినాదంగా మారిన గట్టు ఎత్తిపోతల పథకం ప నులు ప్రారంభించి ఎడారిగా ఉన్న గట్టు ప్రాంతాన్ని పచ్చని పైర్లతో కళకళలాడే వి ధంగా చేస్తానని మాట ఇచ్చి గట్టు ఎత్తిపోత ల పనులు ప్రారంభించి గట్టు ప్రజల చిరకాల వాంఛ తీర్చి ప్రజల మనస్సులో సుస్థిరస్థానం సంపాదించారు.
గద్వాల మండలంలో దివి సీమగా ఉన్న గుర్రంగడ్డ గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం ఎన్నికల హా మీగా మిగిలిపోగా, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల బ్రిడ్జి నిర్మాణానికి అ నుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం గుర్రంగడ్డ బ్రిడ్జి ని ర్మాణ పనులు చేపడుతున్నారు. దీంతో గ్రామస్తుల కళ నెరవేర్చడంతో కేసీఆర్‌కు గ్రామస్తులు జీవితాంతం రుణపడి ఉన్నారు. నడిగడ్డ వి ద్యా, వైద్యపరంగా వెనుకబడిందని భావించి కేసీఆర్ జిల్లాకు గురుకులాలు ఏర్పాటు చేయడంతోపాటు నర్సింగ్, మెడికల్ కళాశాల మంజూరు చేసి 100 పడకల దవాఖానను 300 పడకలకు పెంచి చేయూతనిచ్చారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి గోస, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా సాగుగోస తీర్చి నడిగడ్డ ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్.