మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 5: రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలని డీవైఎస్వో శ్రీనివాస్ జిల్లా నెట్‌బాల్ జట్లకు సూచించారు. శుక్రవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఖమ్మం లో జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్ నెట్‌బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా మహిళ, పురుషుల జట్లు గురువారం ఖమ్మం తరలివెళ్లాయి. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో డీవైఎస్వో నెట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఖాజాఖాన్‌తో కలిసి క్రీడాకారులను అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా లో ప్రతిభ గల క్రీడాకారులకు కొదవలేదని, ఎంతో మంది రాష్ట్ర, జాతీయస్థాయి లో రాణిస్తున్నారని అన్నారు. క్రీడాకారులు టోర్నీలో ప్రతిభచాటి విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు విక్రమాదిత్యరెడ్డి, ఉపాధ్యక్షుడు సాదత్‌ఖాన్, ట్రెజరర్ సోహెల్ ఉర్హ్రెమాన్, పీఈటీలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
పురుషుల జట్టు: సయ్యద్అంజద్అలీ, విక్రమాదిత్యరెడ్డి, మహ్మద్ హబీబ్ఖా న్, అక్రమ్,షరీఫ్,ఇస్మాయిల్,అర్బజ్, సం జు, ఆకాష్,అఖిల్,అమర్,ప్రవీణ్,ఇర్షాద్.
మహిళ జట్టు: ముస్కాన్‌బేగం, సరస్వతి,రాగిణి,స్రామిత, శివగంగా,సాయిప్రియా,అరుణ, స్రవంతి ఉన్నారు.
విద్యార్థినులకు అభినందనలు
రాష్ట్రస్థాయి సీనియర్ నెట్‌బాల్ టోర్నీ కి ఎంపికైన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల పాఠశాల విద్యార్థినులను గురువారం ప్రిన్సిపాల్ రాగలత అభినందించారు.
ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ టోర్నీలో ప్రతిభ చాటి జట్టు విజయానికి కృషి చేసి పాఠశాలకు , జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు.
విద్యార్థులను అభినందించిన వారిలో కోచ్ రాంమెహన్గౌడ్, పీడీ కపిల్వర్మ, పీఈటీ భవాని తదితరులు ఉన్నారు.