మోగనున్న భాజాభజంత్రీలు
ఉమ్మడి జిల్లాలో త్వ రలో భాజాభజంత్రీలు మోగనున్నాయి. మూడు నె లలుగా మూఢాల కారణంగా శుభకార్యాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో డిసెంబర్ మొదటివారం నుంచి పెద్ద సంఖ్యలో పెండ్లిళ్లు జరగనున్నాయి.
- గత నెల 27తో తొలగిన మూఢాలు
- ఈ నెలలో ఐదు శుభ ముహుర్తాలు
- ఏకం కానున్న వేలాది జంటలు
- ఫంక్షన్‌హాళ్లు, కల్యాణ మండపాలకు భారీ డిమాండ్
బాలానగర్, నవంబర్ 30 : ఉమ్మడి జిల్లాలో త్వ రలో భాజాభజంత్రీలు మోగనున్నాయి. మూడు నె లలుగా మూఢాల కారణంగా శుభకార్యాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో డిసెంబర్ మొదటివారం నుంచి పెద్ద సంఖ్యలో పెండ్లిళ్లు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫంక్షన్‌హాళ్లు బుక్ అయ్యాయి. మార్కెట్లు సైతం కళకళలాడుతున్నా యి. డిసెంబర్లో కేవలం ఐదు ముహుర్తాలే ఉండడం తో వేల సం ఖ్యలో పెండ్లిళ్లు జరగనున్నాయి. ఈ మేరకు ఒక్కో ఫంక్షన్హాల్లో రోజుకు కనీసం రెండు పెండ్లిళ్ల చొ ప్పున బుక్ అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
డిసెంబర్ తర్వాత ఫిబ్రవరి వరకు ముహుర్తాలు లేకపోవడంతో డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు పురోహితులు పేర్కొంటున్నారు.సాధారణంగా కార్తీకమాసంలో పెండ్లిళ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ, ఈసారి మూఢాలు ఉండడంతో పెండ్లిళ్లతోపాటు గృహప్రవేశాలు వంటి కార్యక్రమాలు కూడా జరగలేదు. సెప్టెంబర్ 22న మొదలైన మూఢాలు గత నెల 27తో ముగిశాయి. దృక్ సిద్ధాంతం మేరకు డిసెంబర్లో 4, 8, 14, 17, 18వ తేదీల్లో దివ్యమైన ముహుర్తాలు ఉన్నట్లు వేదపండితులు తెలిపారు. పూర్వ సిద్ధ్దాంతం ప్రకారం ఈ నెలలో అదనపు ముహుర్తాలు కూడా ఉన్నప్పటికీ ఐదు మాత్రమే ముఖ్యమైనవి కావడంతో దాదాపుగా పదివేల వరకు పెండ్లిళ్లు జరగనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో ఎక్కువశాతం కన్యరాశి, సింహరాశి ముహుర్తాలే ఉన్నాయి. వస్త్ర, బంగారు ఆభరణాల దుకాణాల్లో గిరాకీ ఊపందుకున్నది.
ముహూర్తాలు
- డిసెంబర్ 4వ తేదీ రాత్రి 11:30 గంటలకు, తెల్లవారుజామున ఒంటి గంటకు మంచి ముహుర్తాలు ఉన్నాయి.
- 8వ తేదీ రాత్రి 11:38 గంటలకు కన్యాలగ్నం, రాత్రి 1:20 గంటలకు నిశీధి ముహూర్తాలు ఉన్నాయి.
- 14 తేదీన మహానక్షత్రం రాత్రి 11:27 గంటలకు మంచి ముహూర్తం ఉన్నది.
- 17వ తేదీ హస్తానక్షత్రం రాత్రి 11:15 గంటలకు..
- 18వ తేదీ ఆదివారం చిత్తనక్షత్రంలో రాత్రి 11:11 గంటలకు.. అర్ధరాత్రి 12:47 సింహలగ్నం ఉన్నది. జనవరి 26వ తేదీ వరకు పెండ్లి ముహుర్తాలులేవు. ఫిబ్రవరిలోనే మరోసారి భాజాభజంత్రీలు మోగనున్నాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- December 2022
- Marriages
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

