దోమలపెంట, జనవరి 2 : అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో నీటి దారా లీకేజీ వల్ల జల విద్యుత్ కేంద్రానికి ఎలాంటి ముప్పులేదని చీఫ్ ఇంజినీర్ రామసుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ కొద్ది రోజులుగా శ్రీశై లం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్కేంద్రంలో నీటిదార వల్ల పవర్హౌస్కు ప్రమాదం జరుగుతుందని సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం జరుగుతుందని, జల విద్యుత్ కేంద్రంలో నీటి ఊట రావడం సర్వసాధారణమని, ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. జల విద్యుత్ కేంద్రం లో యూనిట్-1కు సంబంధించిన డ్రాఫ్ట్ ట్యూబ్ వద్ద నీటి ఊట వస్తుందని డిసెంబర్ 25న గుర్తించి వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మా అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, లీకేజీకి మరమ్మతులు నిర్వహించే పనిలోనే ఉన్నారని వివరించారు.