రాజాపూర్, ఏప్రిల్ 4 : రాజాపూర్ మండలంలోని దోం డ్లపల్లికి చెందిన యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన చోటుచేసుకున్నది. ఎస్సై రవి కథనం ప్రకా రం.. దోండ్లపల్లికి చెందిన గుంతల జంగయ్యకు ఇద్దరు కు మారులు, ఒక కూతురు ఉన్నారు. బుధవారం భార్యాభర్తలు నాగర్‌కర్నూల్‌లో పెళ్లికి వెళ్లగా, కుమారులు కంపెనీలో పనిచేసేందుకు వెళ్లారు. ఇంటి వద్ద కూతురు(21) ఒక్కతే ఉన్న ది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసిన కుటుంబ సభ్యులకు యువతి కనిపించలేదు. కాగా, హెల్మెట్‌తో ఇద్దరు వ్య క్తులు బైక్‌పై యువతిని తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. యువతి తండ్రి అనుమానిత వ్యక్తులపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.