మల్దకల్, మే 21 : కర్ణాటకలోని విజయపుర జిల్లా మనగుంబి సమీపంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్దకల్ మండలంలోని మల్లెందొడ్డికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగు రితోపాటు ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం పాలయ్యారు. గ్రామస్తు లు తెలిపిన వివరాల ప్రకారం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన తెలుగు భాస్కర్ (43) 20 ఏండ్ల కిందట గ్రామాన్ని వదిలి గద్వాల పట్టణంలో నివాసం ఏర్పచుకున్నాడు.
కాగా కర్ణాటక రాష్ట్రం బీజాపుర్ పట్టణంలోని కెనరా బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల బీజాపుర్ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. బదిలీ సందర్భంగా 7 రోజుల పాటు సెలవులు ఉండడంతో భార్య పవిత్ర(35), కుమారులు అభిరామ్, ప్రవీణ్, కూతురు జ్యోత్స్నతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని పుణ్య క్షేత్రాలకు బయలు దేరారు. కాగా బుధవా రం తెల్లవారు జామున 5 గంట ల ప్రాంతంలో విజయపుర జి ల్లా మనగులి సమీపంలో వీరు ప్రయాణించే కారును కర్ణాటక రాష్ర్టానికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదం లో భాస్కర్, ప్రవిత్ర, కూతురు జ్యోత్స్న, కుమారుడు అభిరా మ్తోపాటు ట్రావెల్ బస్సు, కా రు డ్రైవర్లు బసవన్న, శివన్న అక్కడికక్కడే మృతిచెందారు. మరో కుమారుడు ప్రవీణ్‌కు త్రీవ గాయాలు కాగా వెంటనే బీజాపుర్ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న కు టుంబ సభ్యులు హుటాహుటిన బీజాపూర్ తరలివెళ్లారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రాత్రికి వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉందన్నారు.