నవాబ్‌పేట, ఫిబ్రవరి 7: స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో గ్రామాలన్నింటినీ సర్వాంగ సుందరంగా మార్చాలని మండల ప్రత్యేక అధికారి, జిల్లా సహకార శాఖ అధికారి సుధాకర్ సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం ఆయాగ్రామాల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే ప్రత్యేకాధికారి సుధాకర్ దాయపంతులపల్లి, కొండాపూర్, హజిలాపూర్‌లో చేపట్టిన శానిటేషన్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో తాసీల్దార్ మల్లికార్జునరావు, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో భద్రునాయక్, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), ఫిబ్రవరి 7 : ప్రతిఒక్కరూ తమ ఇండ్లను ఏవిధంగా చూసుకుంటారో పరిసరాలను కూడా అదేవిధంగా పరిశుభ్రంగా ఉంచాలని తాసీల్దార్ ఘన్సీరామ్ సూ చించారు. అడ్డాకులలో బుధవారం నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో తాసీల్దార్ పా ల్గొని ప్రజలతోపాటు కలిసి చీపుర్లతో వీధులను ఊడ్చి శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఏవో శ్రీ నివాసులు, విజయ్‌మోహన్‌రెడ్డి, భీమన్నయాదవ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దేవరకద్ర, ఫిబ్రవరి 7 : గ్రామీణ ప్రాంతా ల్లో ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేకాధికారి రవీందర్, తాసీల్దార్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మం డల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రా మాల్లో పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించా రు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మరికల్, ఫిబ్రవరి 7 : గ్రామాల్లో పారిశుధ్యంపై నిర్లక్ష్యం తగదని ప్రత్యేకాధికారులు అ న్నారు. బుధవారం నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా బుధవారం అప్పంపల్లిలో డ్రైనేజీలను, రోడ్లను శుభ్రం చే యించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అప్పంపల్లి ప్రత్యేకాధికారి శ్రీశైలం గ్రా మస్తులకు సూచించారు. కార్యక్రమంలో పం చాయతీ కార్యదర్శి జ్యోతి పాల్గొన్నారు.
ధన్వాడ, ఫిబ్రవరి 7: గ్రామాల్లో పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారులు పారిశుధ్య పనులను ప్రారంభించారు. గున్ముక్లలో ఉపాధి హామీ పథకం కూలీలు, ఆశ, అం గన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో రోడ్లు ఊడ్చి పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దేవరకద్రరూరల్(కౌకుంట్ల), ఫిబ్రవరి 7 : కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాల్లో ఆ యా పంచాయతీ కార్యదర్శులతో కలిసి గ్రామాల్లోని వీధులను శుభ్రం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శులు గ్రామాల ప్రజాప్రతినిధులు, అం గన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
జడ్చర్ల, ఫిబ్రవరి 7 : మండలంలోని గ్రా మాల్లో బుధవారం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ని ర్వహించారు. రోడ్లను, డ్రైనేజీలను శుభ్రం చేశారు. పాఠశాల, గ్రామ పంచాయతీ భవనా ల వద్ద పిచ్చిమొక్కలను, గడ్డిని తొలగించారు. హరితహారంలో నాటిన మొక్కలకు నీటిని పో సేందుకు పాదులు చేశారు. పోలేపల్లిలో పంచాయతీ కార్యదర్శి శివప్రకాశ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు గ్రామస్తులు ప్రత్యేక డ్రైవ్‌లో పాల్గొని రోడ్లను శుభ్రం చేశా రు. కొల్లోనిమోర్ల తండాలో కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బందితో పాటు తండావాసులు పాల్గొని రోడ్లను, పాఠశాల ఆవరణను శుభ్రం చేశారు.
రాజాపూర్, ఫిబ్రవరి 7: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారులు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారని ఎంపీడీవో లక్ష్మీదేవి తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో పారిశుధ్యం పనులు నిర్వహించారు.