పాలమూరు, ఫిబ్రవరి 13 : జేఈఈ ఫలితాల్లో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. మొదటి విడుత ఫలితాల్లో ప్ర తిభ కళాశాల విద్యార్థులు ఏ కార్తీక్సాగర్ 99.83, ఏ గణేశ్ 98.63, బీ అనిరుధ్గౌడ్ 98.22, వీ సాయిఈశ్వర్ 96.20, ఎం ఉమేశ్‌చంద్ర 95.05, కే మౌనిక 94.78, ఆర్ సాయిప్రభాస్ 94.65, ఎం శ్రీవల్లి 94.47, నాగసాయిచేతన్ 93.97, జీ ఐశ్వ ర్య 93.34, ఎం నమిత 93.04, కే అనిల్‌నాయక్ 92.97, జీ పర్ణిక 92.92, జీ శ్రీకాంత్ 92.39, ఆర్ నవ్యశ్రీ 92.21 పర్సంటైల్ సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు.
ఈ ఫలితాల్లో 90 పర్సంటైల్‌లో 32 మంది విద్యార్థులు, 80-90 పర్సంటైల్ మధ్యలో 45మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మొ త్తంగా జేఈఈ అడ్వాన్స్‌కు 215 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిని మంగళవారం కళాశాల డైరెక్టర్స్ కే మంజులాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందించారు.