అచ్చంపేట, ఫిబ్రవరి 27 : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో బీఆర్ఎస్ బృందానికి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించింది. గురువారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వం లో నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రతినిధి బృందం సొరంగ ప్రమాద ఘటనను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు చేయడానికి రాగా, దోమలపెంట సమీపంలోని అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను నిలిపివేశారు. హరీశ్‌రావుతో పాటు చెందిన మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎ మ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీలు నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి, బీరం, గువ్వల, మాజీ కార్పొరేషన్ చైర్పర్స న్, చైర్మన్లు, నాయకుల బృందం భారీ కాన్వాయ్‌తో దోమలపెంటకు చేరుకున్నది. అప్పటికే చెక్‌పోస్టు నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ వరకు అడుగడుగునా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బీఆర్ఎస్ బృందం మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. టన్నెల్లోకి వెళ్లడానికి చివరికి ఎనిమిదిమందిని అనుమతి ఇచ్చారు. పోలీసుల వాహనంలో ఎక్కాలని తాము తీసుకెళ్తామని పోలీసులు వాహనం సిద్ధంగా ఉంచారు. అయితే హరీశ్‌రావు వాహనం దిగలేదు.
తమ వాహనంలోనే వస్తానని చెప్పడంతో పోలీసులు చేసేదిలేక రెండు వాహనాలలో ఎనిమిదిమందిని అనుమతి ఇచ్చి వెనుకముందు పోలీసుల వాహనాలతో తీసుకెళ్లారు. నిన్నటి వరకు రెండు చెక్‌పోస్టులు ఉండేవి. బీఆర్ఎస్ నే తల కోసం మరో రెండు చెక్‌పోస్టులు అదనంగా ఏర్పాటు చేశారు. మూడు చెక్‌పోస్టుల వద్ద క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతించారు. లోపల నాలుగో చెక్‌పోస్టు వద్ద మళ్లీ వాహనాలు ఆపి అందులో ఉన్న మాజీమంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయు డు కిందికి దింపి వాహనాలను తనిఖీ చేశారు. వెంబడి కె మెరాలు, ఫోన్లు ఉండరాదని ఆంక్షలు విధించారు. కెమెరామెన్ ఉంటే కూడా దింపి బయటకు పంపించేశారు. ఎ నిమిది మంది వద్దని కేవలం ఆరుగురే వెళ్లాలని ఆపేశారు. దీంతో ప్రభుత్వ తీరును ఖండిస్తూ హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు, మర్రిజనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డిలు నేలపై కింద కూర్చోని నిరసన వ్యక్తం చేయగా చివరకు అనుమతించారు.
టన్నెల్ వద్ద ప్రమాద స్థలిని పరిశీలించిన అనంతరం తిరిగి జేపీ కంపెనీ గెస్ట్‌హౌజ్ వద్ద మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఎమ్మెల్సీలు నవీన్‌రెడ్డి, కోటిరెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ గిడ్డంగుల కార్పోరేషన్ చైర్పర్సన్ రజీనిసాయించంద్ల వా హనాన్ని మూడో చెక్‌పోస్టుకు వద్ద నిలిపివేశారు. టన్నెల్లోకి అనుమతి లేదని వాహనం అక్కడే నిలిపివేశారు. తా ము ఇద్దరం ఎమ్మెల్సీలమని నవీన్‌రెడ్డి, కోటిరెడ్డిలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వనపర్తి ఎస్పీ గిరిధర్‌తో వాగ్వివాదానికి దిగారు. త నను ఎందుకు నెట్టివేస్తున్నావని, మేము ప్రజల తరఫున వచ్చామని ఎంతచెప్పినా ఆరగంటపాటు వాదోపవాదాలు చేసుకున్న అనుమతించలేదు. దీంతో వారు ప్రభుత్వ తీ రుపై మండిపడ్డారు. ఇలాంటి చి ల్లర ప్రభుత్వాన్ని తామెప్పుడూ చూడలేదన్నారు. బీఆర్ఎస్ నేతలను చూస్తేనే ప్ర భుత్వం భయపడుతుందని పోలీసుల తీరును ఖండించారు. అక్కడ మీడియా పాయింట్ పక్కనే గెస్ట్‌హౌజ్‌లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారని కొ ందరు మీడియా మిత్రులు హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు.
మీడియా సమావేశం అనంత రం హరీశ్‌రావు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసేందుకు గెస్ట్‌హౌస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు వేశారు. తా ను మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా అనుభవం ఉందని కొన్ని సూచనలు, సలహాలు చే సేందుకు మంత్రి ఉత్తమ్‌ను కలుస్తానని చెప్పినా పోలీసు లు అనుమతించలేదు. కలువడానికి అనుమతి లేదని అ క్కడున్న వనపర్తి ఎస్పీ గిరిధర్రావుల హరీశ్‌రావు వెళ్లకుం డా ఆపేశారు. హరీశ్‌రావు గేటును తోసుకుంటూ వెళ్లే ప్ర యత్నం చేసిన పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. బీఆర్ఎస్ నేతలుగా మేము రాజకీయం చేసేందుకు రా లేదు. టన్నెల్లో పనులు వేగవంతం చేసి, లోపల ఉన్న ఎనిమిది మంది కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు తమవంతు కొంత సూచనలు చేసేందుకు కలుస్తామని చెప్పిన పోలీసులు మంత్రి ఉత్తమ్‌ను కలువడానికి అనుమతి ఇవ్వలేదు. ఎస్పీ, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చో టుచేసుకున్నది. ప్రభుత్వతీరు, పోలీసుల ఆంక్షలను హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నేతల పర్యటనను భయపడి ప్రభుత్వం పోలీసుల ద్వారా కట్టిడి చేస్తుందన్నారు. మీడియాకు అనుమతి ఇవ్వ కపోవడంతో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన నుంచి స్పందన రాలేదు. ఎండలో నిల్చోకుండా టెంట్ వే సి నీటి సౌకర్యం కల్పించారు.