కొత్తకోట, నవంబర్ 28 : కొత్తకోట మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నిర్వహించిన రోడ్ షో జనహోరును తలిపించింది. రోడ్‌షోకు భారీగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కావడంతో హాజరు కావడంతో సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ చదువుకున్న సంస్కారం లేకుండా ఇతరుల గురించి ఏ విధంగా మాట్లాడాలో తెలియని సంస్కార హీనుడు కాంగ్రెస్ అభ్యర్థి జీఎంఆర్ అని దుయ్యబట్టారు.
ఇతరులను ఏ విధంగా గౌరవించాలో తెలియని వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి అని, అదే నేను నోరు తెరిచానంటే చౌరస్తాలో విద్యుత్ స్తంభానికి ఉరేసుకుంటావని అన్నారు. సమావేశంలో జెడ్పీవైస్ చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ గుంతమౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, ప్రదీప్‌కుమార్‌గౌడ్, బాలమణెమ్మ, విశ్వేశ్వర్, ప్రశాంత్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.