మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 25 : వ్యక్తి నిర్మాణానికి, మానవ వికాసానికి, సమాజ పురోగతికి విద్య కీలక సాధనం. ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా విద్యావ్యవస్థను బలోపేతం చేయడం అత్యంత ఆవశ్యం. సంప్రదాయ విద్యకన్నా సాంకేతిక విద్య బహుళ ప్రయోజనకరం. దేశంలోనే వెనుకబడిన ఉమ్మడి పాలమూరులో 29 ఏండ్ల ప్రస్థానంలో జయప్రకాశ్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (జేపీఎన్సీఈ) కళాశాల ఎందరో విద్యార్థులను ఉన్నతస్థాయికి చేర్చింది. వేలాదిలాది మంది వివిధ రంగాల్లో ఖ్యాతిని చాటుకున్నారు. సమాజ అవసరాలను తీర్చుతున్న సాంకేతిక విద్య.. ఉపాధి అవకాశాల గని జేపీఎన్సీఈ. నాక్ అక్రిడిటేషన్, యూజీసీ అటానమస్ స్థాయి పొందిన ఏకైక కళాశాలగా గుర్తింపు పొందింది. త్వరలో విశ్వ విద్యాలయంగా మారి మరింత మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలన్న సదుద్దేశ్యంతో 1997లో స్థాపించబడిన మొట్టమొదటి ఇంజినీరింగ్ కళాశాల జేపీఎన్సీఈ. దివంగత ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్‌రెడ్డి ఆశీస్సులతో.. సంపూర్ణ విప్లవ ఆధ్యుడు, సామ్యవాద నాయకుడు లోక్‌నాయక్, భారతరత్న ‘జయప్రకాశ్ నారాయణ’ పేరుతో ధర్మాపూర్ సమీపంలో కళాశాలను కేఎస్ రవికుమార్ స్థాపించారు. 27.2 ఎకరాల విస్తీర్ణంలో సొంత భవనాలు కలిగి, తరగతి గదులు, ల్యాబ్ వసతులు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీతో విద్యాబోధన అందిస్తున్నది.
ఇంజినీరింగ్ కళాశాలలు-2 ఉన్నాయి. వీటితోపాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను అందిస్తున్నది. తన విద్యా ప్రస్థానాన్ని విస్తరించే ఉద్దేశంతో హైదరాబాద్‌లో జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ (జేపీఎన్హెచ్) బండ్లగూడ ప్రాంతంలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభించా రు. కళాశాలల్లో ప్రవేశాలకు 8886680002, 04, 05, 08, 15, 16, 17 నెంబర్లను సంప్రదించవచ్చు.
ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించేందుకు కంప్యూటర్ సైన్స్ విద్యార్థులను సాఫ్ట్వేర్ కంపెనీలకు, ఎలక్ట్రికల్ విద్యార్థులను శ్రీశైలం, నాగార్జునసాగర్ పవర్ ప్రాజెక్ట్స్, మెకానికల్ విద్యార్థులకు ఇండస్ట్రీస్‌కు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తుంటారు.
జేపీఎన్సీఈ కళాశాల విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నెక్ట్స్ వేవ్ అనే ప్రముఖ సంస్థతో ఒప్పందం చేసుకున్నది. కంప్యూటర్ ల్యాబ్స్ తో శిక్షణ ఇస్తున్నది. టాస్క్, ఈఎస్సీఐ, సీస్కో, ఇన్ఫోసిస్, స్ప్రింగ్లఫైలా తదితర సంస్థలతో ఒప్పందం చేసుకోవడం, సాంకేతిక నైపుణ్యాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడంతో విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారు.
ఈ విద్యా సంవత్సరం 211 మంది విద్యార్థులు 13 కంపెనీల ద్వారా ప్రముఖ పరిశ్రమల్లో ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తించేందుకు ఎంపికయ్యారు. బీటెక్ లాస్టియర్ విద్యార్థిని కే.పూజిత ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ ని యామకపత్రం అందుకున్నది. ఎంబీఏ వి ద్యార్థిని బీ. స్వాతి జేఎన్టీయూ టాపర్‌గా నిలిచి గోల్డ్ మెడల్ సా ధించింది. ఇంటర్ ప్రభుత్వ కళాశాలలో చదివి ఈఏపీ సెట్ కన్వీనర్ ద్వారా కళాశాలలో సీటు పొందిన విద్యార్థినులకు బీటెక్ నాలుగేండ్ల ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తుండగా.. 70 మంది లబ్ధి పొందుతున్నారు.
సేవా కార్యక్రమాలు : ప్రతి సంవత్సరం మార్చి 23న షాహీద్ దివస్, అక్టోబర్ 11న జయప్రకాశ్ నారాయణ్ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. ప్రతి శిబిరంలో కచ్చితంగా 70 మందికిపైగా విద్యార్థులు, అధ్యాపకులు రక్తదానం చేస్తారు. సామాజిక సేవలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్ర జారోగ్య సంక్షేమం, విద్యాభివృద్ధి, నిరక్షరాస్యత ని ర్మూలన సంబంధిత కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. రెడ్‌క్రాస్ ద్వారా అందించిన సామాజిక సేవలకు గుర్తింపుగా ఐదుగురు గవర్నర్ల నుంచి ఉత్తమ ప్రశంసలతోపాటు గోల్డ్ మెడల్స్‌ను జేపీఎన్సీఈ చైర్మన్ కేఎస్.రవికుమార్ అందుకున్నారు.
సాధించిన విజయాలు : జేపీఎన్సీఈ విద్యా కుసుమాలు 2025 సంవత్సరంలో ఎంబీఏ విద్యార్థిని బీ.స్వాతి జేఎన్టీయూహెచ్ గోల్డ్ మెడల్ సాధించి కళాశాల కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడింపజేసింది. గతంలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎం.ఈశ్వర్‌చంద్ర, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో శేఖర్‌రెడ్డి తదితరులు జేఎన్టీయూహెచ్ గోల్డ్ మెడల్స్ సాధించారు.
28 ఏండ్ల విద్యా ప్రస్థానంలో 17,500 మంది ఇంజినీర్లను తయారు చేసిన ఘనత జేపీఎన్సీఈకే దక్కింది. 3,500 మంది యూఎస్ఏలో, 4వేల మంది ఇతర దేశాల్లో ఉన్నత హోదాలో స్థిరపడ్డారు. కొందరు తమ సొంత కంపెనీలను స్థాపించి ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. గత నెలలో కళాశాల పూర్వ విద్యార్థులు యూఎస్ఏలో సమావేశమై కళాశాల రోజులను జ్ఞాపకాలను నెమరేసుకొని కళాశాల, సాంకేతిక విద్యాభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తామని ప్రతినబూనారు.
హిటాచీ గ్రీన్ స్కాలర్షిప్ : బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ట్రిపుల్ఈ విద్యార్థినులు ఏడుగురు హి టాచీ గ్రీన్ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. 9 రాష్ర్టాల్లో అమలవుతున్న ఈ ప్రక్రియలో ఈ విద్యా సంవత్సరం 130 మంది ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుం చి 15 మంది ఎంపిక కాగా వారిలో ఏడుగురు జేపీఎన్సీఈ విద్యార్థినులే కావడం విశేషం. ఎంపికైన వారికి ల్యాప్‌టాప్‌తోపాటు ప్రతి సంవత్సరం రూ.20 వేల చొప్పున నాలుగేండ్లు అందిస్తారు.
కళాశాలలో బీటెక్ (సీఎస్సీ, ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ట్రిపుల్ఈ, ఈసీ, సివిల్, మెకానికల్ కోర్సులు), ఎంటెక్ (డీఎస్సీఈ, క్యాడ్క్యామ్-సీఏడీ/సీఏఎం) తోపాటు పీహెచ్డీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొ మా కోర్సులు అందిస్తున్నది. కళాశాల అటానమస్ సా ధించడం ద్వారా పాఠ్య ప్రణాళికలో కొంతభాగం స్థానిక వనరులు, అవకాశాలు, అవసరాలకు అనుగుణంగా మార్పు చేసుకొనే అవకాశం ఉన్నది.