పాలమూరు: మహబూబ్నగర్ ( Mahabubnagar ) జిల్లా మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయం వీరభద్రస్వామి ఆలయంలో అఖండ విష్ణు సహస్రనామ పారాయణం ( Vishnu Sahasranama Parayanam ) భక్తిశ్రద్ధలతో కొనసాగింది. క్షేత్రపాలకులు ప్రతి సంవత్సరం మాదిరిగా శ్రావణమాసం రెండో సోమవారము నుంచి 45 రోజుల పాటు అఖండ దీపారాధన ఏర్పాటు చేశారు. శ్రావణ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆలయం అనుమదాసు మంటపంలో అఖండ విష్ణు సహస్రనామ పారాయణాన్ని గద్వాల ఉమాపతి బృందం , సుధా సత్యసాయి బృందం ఆధ్వర్యంలో కొనసాగిందని, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్ తెలిపారు.