కొల్లాపూర్, మార్చి 27 : మండలంలోని నల్లమలకు స మీపంలోనిముక్కిడిగుండం నుంచి వర్షకాలంలో బయటకు రావాలంటే జలవలయాన్ని ఛేదించాల్సి వచ్చేది. గ్రా మ సమీపంలోని పెద్దవాగు వర్షాకాలంలో ఉధృతంగా పా రుతుండడంతో వానకాలంలో కొద్దిరోజులు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతుంటాయి. జలదిగ్భందంలో ఉండే ముక్కిడిగుండం, గేమ్యానాయక్ తండాల గురించి నాయకులు సానుభూతి మాత్రమే చూపే వారు కానీ పరిష్కార మార్గం అన్వేషించే వారు కాదు. ఎందుకంటే ఎన్నికల డిమాండ్‌గా ఉన్నప్పుడే ఆయా గ్రామాల నుంచి గంపగుత్తగా ఓట్లు పడుతాయనే ఆలోచన పాలకులది.
ఇప్పటికే జరిగిన ప్రమాదాలు
వర్షాకాలంలో పెద్దవాగులో ఎన్నో సార్లు ప్రమాదాలు జరిగాయి. 2012లో లచ్చనాయక్‌తండా రైతు మలబస్వాపూ ర్ శివారులో పొలం పనులు ముగించుకొని సా యం త్రం వాగు దాటుతుండంగా నీటి ఉధృతికి ఎడ్లబండి నీళ్లల్లో కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగాయి. ఈ ప్రాంత ప్రజల ఓట్లతో మంత్రి పదవులు అనుభవించిన వారు దశాబ్దాల పాటు తమను మోసం చేశారని ముక్కిడిగుండం, గేమ్యానాయక్ తండా ప్రజలు ఆరోపిస్తున్నారు.
బీరం హయాంలో..
ముక్కిడిగుండంలో 6 వేల జనాభా.. గేమ్యానాయక్‌తండాలో 600 జనాభా ఉన్నది. ముక్కిడిగుండం నుంచి ఏ చిన్న పనికైనా.. కొల్లాపూర్ వెళ్లాల్సిందే.. కాగా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ రెండు గ్రామాల వాసులు జంకేవారు. కొల్లాపూర్‌కు వెళ్లాలంటే పెద్దవాగు రూపంలో వారికి గండం ఎదురయ్యేది. సుదీర్ఘకాల సమస్యగా ఉన్న పెద్దవాగు సమస్యకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిష్కారం దొరికింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి చొరవతో ప్రత్యేక అభివృద్ధి నిధుల (ఎస్డీఎఫ్) నుంచి రూ.9 కోట్లు బ్రిడ్జి నిర్మాణానికి మంజూరు చేయించారు.
2023 ఏప్రిల్ 13న నాటి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి ఆయన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనతి కాలంలో నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావడంతో ముక్కిడిగుండం, గేమ్యానాయక్ తండా, మొలచింతలపల్లి గ్రామస్తులతో పాటు నార్లాపూర్, లచ్చనాయక్‌తండా రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో పాటు నాటి కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
నార్లాపూర్ రైతుల ఆత్మగౌరం వంతెన..
నార్లాపూర్, ముక్కిడిగుండం గ్రామాల మధ్యనున్న పెద్దవాగు ఉప్పొంగినప్పుడు ముక్కిడిగుండం, గేమ్యానాయక్ తండా గ్రామస్తులు గ్రామ పొలిమేర దాటలేక అవస్థలు పడితే నార్లాపూర్ గ్రామ మహిళా రైతులు, మహిళా కూలీలు ఆత్మగౌరవం చంపుకొని పెద్దవాగు దాటేందుకు నరకయాతన అనుభవించేవారు.
నార్లాపూర్ పెద్దవాగు అవతలి భాగంలోని మలబస్వాపూర్, నార్లాపూర్, ముక్కిడిగుండం, మొలచింతలపల్లి శివారులో నార్లాపూర్, లచ్చనాయక్‌తండా గ్రామంలోని దాదాపు 150 మంది రైతులకు 260 ఎకరాల సాగు భూమి ఉన్నది. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు తప్పని పరిస్థితుల్లో దాటి పొలాలకు వెళ్లే అవకాశం ఉండేది కాదు. ప్రవాహం తగ్గిన తర్వాత నడుంలోతు నీళ్లను సైతం దాటేందుకు మహిళలను చంపుకోవాల్సి వచ్చేది. వంతెన నిర్మాణంతో పూర్తి కావడంతో నార్లాపూర్ మహిళా రైతులు, కూలీల కన్నీటికి పరిష్కారం లభించినట్లయ్యింది.
బీఆర్ఎస్ హయాంలో నిర్మిస్తే.. కాంగ్రెస్ సర్కారులో రంగులేస్తారా..?
ఐదు గ్రామాల ప్రజల సమస్యలను కాంగ్రెస్ గాలికి వదిలేస్తే కేసీఆర్ ప్రభుత్వం వారి సమస్యకు శాశ్వత పరిష్కారంగా వాగుపై వంతెన నిర్మించింది. ఇదంతా చేసింది బీఆర్ఎస్ అయితే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి రంగులు వేసింది. తామే నిర్మాణం చేసినట్లు చెప్పుకోవడం చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం పుట్టించిన బిడ్డకు కాంగ్రెస్ సర్కారు ముద్దు పెట్టుకున్నట్లు ఉన్నదని ఆయా గ్రామాల ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.
మా పాలిట హర్షన్న దేవుడు..
వానకాలంలో గ్రామం నుంచి బయటకు రావాలంటే భయంగా ఉండేది. పెద్దవాగు దాటాలంటే ప్రాణాలను ఫణంగా పెట్టాల్సి వ చ్చేది. ఏన్నో ఏండ్ల నుంచి పెద్దవాగుతో అవస్థలు పడ్డాం. గతంలో ఎ వరూ వంతెన నిర్మాణానికి చొరవ చూపలేదు. హర్షవర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక.. కరోనా సమయంలో ప్రభుత్వం వద్ద నిధులు లేకున్నా బ్రిడ్జి నిర్మింపజేశారు. సాధ్యం కానీ పనిని సుసాధ్యం చేసి మా కలను నెరవేర్చి గ్రామాన్ని నీటి గండం నుంచి తప్పించాడు. మా పాలిట హర్షన్న దేవుడిలా వచ్చాడు.. ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోలేనందుకు సిగ్గుపడుతున్నాం.
– బాలు నాయక్, ముక్కిడిగుండం
మా ఆత్మగౌరవాన్ని కాపాడారు..
మాకు పెద్దవాగు అవతల ఐదెక రాల భూమి ఉన్నది. కానీ వర్షాకా లంలో పెద్ద వాగు ప్రవహించిన ప్పుడు వాగు దాటేవాళ్లం కాదు. వాగులో ప్రవాహం తగ్గినప్పుడు నడుంలోతు నీళ్లల్లో ఆత్మ గౌరవాన్ని చంపుకొని పెద్ద వాగును దాటే వాళ్లం. ఇప్పుడు బెంగపడాల్సిన అవసరం లేదు. ఈ వానకాలంలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని పెద్దవాగు వంతెనపై నడుచుకుంటూ వెళ్లి పొలం పనులు చేసు కుంటాం. మాజీ ఎమ్మెల్యే బీరం వంతెన నిర్మించి ప్రాంత వాసుల ఆత్మగౌరవాన్ని కాపాడారు.
– ముడావత్ చిట్టెమ్మ, మహిళా రైతు, లచ్చనాయక్‌తండా