జడ్చర్ల, జనవరి 5 : కందులకు రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి. గురువారం క్వింటా రూ.8,509ధర పలుకగా శుక్రవారం రూ.8,661 కి పెరిగాయాయి. అంటే ఒక్కరోజులోనే దాదాపుగా రూ.160 పెరిగింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం 177 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.8,661, కనిష్ఠంగా రూ.8,169, మధ్యస్తంగా రూ.8,661 ధర పలికింది. అదేవిధంగా 352 క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠం గా రూ.3,134, కనిష్ఠంగా రూ.2,839, మధ్యస్తం గా రూ.3,134 ధర లభించింది.
అలాగే 20క్వింటాళ్ల మొక్కజొన్న అమ్మకానికి రాగా దానికి క్వింటాకు గరిష్ఠంగా రూ.2,170, కనిష్ఠంగా రూ. 2,170, మధ్యస్తంగా రూ.2,170 ధర వచ్చింది. 84క్వింటాళ్ల హంసధాన్యం అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.2,125 ధర పలికింది. మార్కెట్కు 774క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా దానికి క్వింటాళుకు గరిష్ఠంగా రూ.8,209 ధర పలికినట్లు అధికారులు తెలిపారు.