మూసాపేట, జనవరి 29 : మండలంలోని తు ంకినీపూర్లో ఉన్న మణి కోళ్ల పరిశ్రమను తొలగించాలని బుధవారం గ్రామస్తులు ఆ పరిశ్రమ ఎదుట టెంట్ వేసి ధర్నా నిర్వహించారు. కోళ్ల పరిశ్రమ చు ట్టూ వ్యవసాయ పంట పొలాలు ఉంటాయి. పం టల కాపాలకు వెళ్లిన రైతులు అడవి పందులను బె దిరించడం కోసం టార్చ్ లైట్ వేస్తుంటారు. పొలాల పక్కనే కోళ్ల పరిశ్రమలో పనిచేసే కూలీలు నివాసం ఉంటారు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి పంట పొలాలకు కాపాలగా వెళ్లిన రైతులు టార్చ్‌లైట్ వేయడంతో ఆ లైట్లు తమ ఇంటికి వేశారని ఆ కూలీలు గ్రామ రైతులను చితకబాదారు.
దీంతో మహేశ్, స్వామి, రవీందర్, శివకు రక్తగాయాలయ్యాయి. విషయం గ్రామంలో తెలియడంతో గ్రా మస్తులంతా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడం తో కూలీలు అక్కడి నుంచి పారిపోయారు. బుధవారం ఉదయం గ్రామస్తులంతా కలిసి ఉదయం కో ళ్ల పరిశ్రమ నుంచి దుర్వాసన రావడంతోపాటు, రా త్రి సమయంలో రైతులకు రక్షణ లేకుండా పోయిందని పరిశ్రమ ఎదుట టెంట్ వేసి ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న మూసాపేట ఎస్సై వేణు, అ డ్డాకుల ఎస్సై శ్రీనివాసులు అక్కడికి చేరుకొని గ్రా మస్తులతో జరిగిన ఘటపై ఆరా తీశారు. తర్వాత గ్రామస్తులు, కోళ్ల పరిశ్రమ వారితో మాట్లాడి నచ్చజెప్పారు. మొదట గాయ పడిన వారు ఫిర్యాదు చేస్తే దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కోళ్ల పరిశ్రమ తో జరుగుతున్న ఇబ్బందులపై ఫిర్యాదు చేస్తే సం బంధిత అధికారులకు సమాచారం ఇస్తామని చెప్పా రు. రేపు ఉదయం పరిశ్రమ యజమాన్యం, గ్రామస్తులు కలిసి చర్చించాక సమస్య పరిష్కారం కాకపో తే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి వారి సూ చన మేరకు చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.