హన్వాడ : బీఆర్ఎస్ హన్వాడ మండల కార్యకర్తల సమావేశాన్ని(BRS Meeting) విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షులు కర్ణాకర్ గౌడ్ ( Karnakar Goud) పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 11న మండలంలోని 35 గ్రామ పంచాయతీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 420 ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు అయ్యేంతవరకు ప్రజల పక్షాన పోరాటం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలరాజ్, మాజీ మండల అధ్యక్షులు చెన్నయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొండ లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ వెంకన్న, సింగల్ విండో డైరెక్టర్ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ జంబులయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు మాధవులు పాల్గొన్నారు.