జడ్చర్లలో వైష్ణవి హత్య బాధాకరం
జడ్చర్ల పట్టణంలో ఓ ప్రేమోన్మాది చేతిలో ఉన్నత విద్యావంతురాలు వైష్ణవి దారుణహత్యకు గురికావడం బాధాకరమని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి
- మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి
- యువతి కుటుంబ సభ్యులకు పరామర్శ
జడ్చర్లటౌన్, మే 29 : జడ్చర్ల పట్టణంలో ఓ ప్రేమోన్మాది చేతిలో ఉన్నత విద్యావంతురాలు వైష్ణవి దారుణహత్యకు గురికావడం బాధాకరమని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జడ్చర్లలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వైష్ణవి కుటుంబసభ్యులను శుక్రవారం రాత్రి మాజీ మంత్రి పరామర్శించారు. ముందుగా వైష్ణవి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. వైష్ణవి హత్య ఘటన గురించి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.
తీవ్ర దుఃఖంలో ఉన్న వైష్ణవి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఆడపిల్లలకు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీమాజీ వైస్‌చైర్మన్ యాదయ్య, పిట్టల మురళి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

