తాగునీటి కోసం ఆడపడుచులు బిందెలతో రోడ్డెక్కొద్దన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ’ నేడు పల్లె ప్రజల కష్టాలను దూరం చేయనున్నాయి. నీటి కోసం కిలోమీటర్ల మేర వాగులు, వ్యవసాయ బావులు, బోర్లు తిరిగిన ప్రజల గోస తీర్చేందుకు భగీరథ నీళ్లు పల్లెలను ముద్దాడనున్నాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్‌తో వనపర్తి జిల్లాకు శాశ్వతంగా నీటిని అందించేందుకు రూ.300 కోట్లతో పనులు చేపట్టారు. ఇంటింటికీ స్వచ్ఛ జలాలను సరఫరా చేసే పనులు చకచకా సాగుతున్నాయి. 378 గ్రామాలకు ఏడాది పొడవునా శుద్ధమైన తాగునీరు అందనున్నది. వచ్చే నెలలో అధికారులు ట్రయల్న్ నిర్వహించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కృషి ఫలించనుండగా.. జనం.. ప్రత్యేకంగా మహిళల కష్టాలు దూరం కానున్నాయి.
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వనపర్తి జిల్లాలో శాశ్వత కరువును పారదోలేందుకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమ్తసముద్రాలను కృష్ణాజలాలతో నింపారు. అలాగే శాశ్వతంగా తాగునీటి అవసరాలు తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రూ.300 కోట్లతో ప్రత్యేక మిషన్ భగీరథ స్కీంను మంజూరు చేయించారు.
పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ పథకం ద్వారా జిల్లాలోని 378 గ్రామాలకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరం తాగునీరందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గౌరిదేవిపల్లి రిజర్వాయర్ నుంచి వనపర్తి జిల్లాకు ఏడాదికి 1.3 టీఎంసీలను బుగ్గపల్లి తండా సంప్‌హౌస్‌కు తరలించి.. అక్కడ శుద్ధి చేసిన జలాలను గ్రామాలకు సరఫరా చేయనున్నారు. శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్ నుంచి ఎండాకాలంలో కూడా నిరంతరంగా తాగునీరు సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించారు. బుగ్గపల్లి తండా వద్ద 75 మిలియన్ లీటర్లు, కానాయపల్లి వద్ద 20 మిలియన్ లీటర్లు, గోపాల్పేట వద్ద 10 మిలియన్ లీటర్ల సామర్థంతో సంప్హౌస్లు నిర్మిస్తున్నారు. ఈ మూడింటి ద్వారా 378 గ్రామాలకు నీటిని సరఫరా చేయనున్నారు. ఎల్లూరు వద్ద ఉన్న మిషన్ భగీరథ స్కీం ద్వారా 40 గ్రామాలకు తాగునీరందుతున్నది.
అయితే, వనపర్తి జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీటి ఎద్దడి లేకుండా శుద్ధి చేసిన నీటిని అందించనున్నారు. బుగ్గపల్లి తండా వద్ద జరుగుతున్న పనులను ఇటీవల కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్ పరిశీలించారు. పనులు నాణ్యతగా, శరవేగంగా పూర్తి చేసినందుకు అధికారులను అభినందించారు. వచ్చే నెలలో ట్రయల్న్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎండాకాలానికి తాగునీటిని అందిస్తామన్నారు. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా ఉమ్మడి రాష్ట్రంలో వనపర్తి కేంద్రంగా రాజకీయ చక్రం తిప్పిన హేమాహేమీ నేతలు ఇక్కడి అభివృద్ధిని మరిచారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లాగా మారిన తరువాత మంత్రి నిరంజన్‌రెడ్డి శాశ్వత అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దీంతో విపక్షాల గుండెల్లో గుబులు రేగుతున్నది.
వనపర్తి జిల్లాలో తాగునీటి అవసరాలకు జూరాల ద్వారా లింక్ అయిన రిజర్వాయర్ల నుంచి మిషన్ భగీరథ పథకాని కి అనుసంధానం చేశారు. నాలుగు దిక్కుల నుంచి తాగునీ రు సరఫరా అవుతున్నాయి. జూరాల నుంచి ఎండాకాలం లో అనుకున్నంత నీళ్లు తీసుకోలేమని గ్రహించిన మంత్రి నిరంజన్‌రెడ్డి.. శాశ్వత తాగునీటి పథకానికి సంకల్పించారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.300 కోట్ల వ్యయంతో మి షన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. పెద్దమందడి మండలం బుగ్గపల్లి తండాలో మిషన్ భగీరథ పథకం మె యిన్ సంప్‌హౌస్ నిర్మిస్తే జిల్లా మొత్తానికి తాగునీరు సరఫ రా చేయొచ్చని ఇంజినీర్లు సూచించారు. దీంతో ఈ తండా వద్ద 75 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో భారీ సంప్‌హౌస్, నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు నిర్మిస్తున్నారు. దీని ద్వారా 225 గ్రామాలకు నీటిని సరఫరా చేయనున్నారు. కానాయపల్లి వద్ద 20 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న సంప్‌హౌస్ ద్వారా 124 గ్రామాలకు, గోపాల్పేట వద్ద 10 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న సంప్‌హౌస్ నుంచి 52 గ్రామాలకు నీటిని సరఫరా చేయొచ్చని అధికారులు చె బుతున్నారు. గౌరిదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను బుగ్గపల్లితండాకు తరలించి.. అక్కడి నుం చి జిల్లా మొత్తం నాలుగు స్టేజీల్లో నీటిని సరఫరా చేస్తారు. దీనికి అవసరమైన 59 కిలోమీటర్ల మెయిన్ ఎంఎల్డీ పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయని మిషన్ భగీరథ ఈఈ మేఘారెడ్డి తెలిపారు. ఇక్కడి రిజర్వాయర్లతోపాటు శ్రీశైలం బ్యాక్‌వాటర్ ద్వారా ప్రత్నామ్నాయంగా తాగునీటిని తరలించాలన్నదే లక్ష్యం. జిల్లాకు ఏటా అన్ని మండలాలు, గ్రా మాలకు కలిపి 1.3 టీఎంసీలు అవసరం అవుతుందని అధికారులు అంటున్నారు.
వనపర్తి.. మూడు జిల్లాలకు సరిహద్దుగా ఉన్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఒకే నియోజకవర్గంగా ఉన్న జిల్లా ఇదే. కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్ నియెజకవర్గంలోని కొన్ని మండలాలను కలిపి జి ల్లాగా మార్చారు. వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మ రుక్షణమే సాగునీటి రంగంపై ప్రధాన దృష్టి సారించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించి కృష్ణానీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్త రిజర్వాయర్లను పూర్తి చేయించి జూరాల బ్యాక్‌వాటర్, భీమా ఫేజ్-2 ద్వారా సాగునీటిని అందించారు. జిల్లాలో శాశ్వత కరు వు నివారణ చర్యలు చేపట్టి, శంకరసముద్రం, రామన్‌పాడు, సరళాసాగర్, రంగసముద్రం, గోపల్‌దిన్నె రిజర్వాయర్లు, ప్రాజెక్టులకు నీళ్లు మళ్లించి.. అక్కడి నుంచి కాల్వల ద్వారా సాగునీటి అవసరాలను తీ ర్చారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉమ్మడి జిల్లాలో అత్యంత ఎక్కు వ విస్తీర్ణంలో సాగుబడి తీసుకొచ్చిన ఘనత దక్కించుకున్నారు. నీళ్ల నిరంజన్‌రెడ్డి అనే పదాన్ని సార్థకం చేశారని ప్రజలు చెబుతున్నారు.
వనపర్తి జిల్లాలో ఎండాకాలంలో కూడా తాగునీటి ఎద్దడి ఉండొద్దనే ఉద్దేశంతో రూ. 300 కోట్లతో బుగ్గపల్లితండా వద్ద మిషన్ భగీరథ పనులు ప్రారంభించాం. అనుకున్న సమయంలోనే ఈ పథకం ద్వారా శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేస్తాం. పల్లెలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రంలో తాగునీటి ఎద్దడి ఉండొద్దనే ఈ స్కీంకు శ్రీకారం చుట్టాం. అధికారులు చిత్తశుద్ధితో పనులు త్వరితగతిన పూర్తి చేశారు. శుద్ధమైన నీటిని గ్రామాలకు సరఫరా చేయడమే మా లక్ష్యం.
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి