గద్వాల, జూన్ 8 : ఒకప్పుడు నగరాలకే పరిమితమైన గంజాయి దందా ప్రస్తుతం జిల్లాలకు పాకింది. కొందరు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఈ దం దాను నగరాల నుంచి జిల్లాలకు చేర్చారు. ఈ దందా చేసే వారికి ఖద్దరు నాయకుల అభయ హస్తం అందించడంతో ప్రశాంతంగా ఉన్న నడిగడ్డ గంజాయి అడ్డగా మారింది. ఇప్పుడిప్పుడే దీని మూలాలు జిల్లాలో కనిపిస్తుండడంతో ఆదిలోనే దీనికి పోలీసులు చరమగీతం పాడితే యువత మత్తు వైపు వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది.
లేకపోతే జిల్లాలో గంజాయి గుప్పుమనే అవకాశాలు లేకపోలేదు. గద్వాల ప్రజలు నూడ్కాల్స్ వ్యవహరం మరువక ముందే, గద్వాల చెందిన వ్యక్తి నుంచి గంజాయి స్వాధీనం చేసుకోవడం జిల్లాలో కలకలం రేపుతున్నది. కొన్ని ప్రైవేట్ దవాఖానలతో పాటు టీ షాపుల వద్ద ఈ దందా జోరుగా కొనసాగుతున్నట్లు సమాచారం. దీనిని అరికట్టడానికి ఎక్సై జ్, పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ దందా మా త్రం ఆగడం లేదు. గద్వాల జిల్లాకేంద్రంలో గుప్పుమంటు న్న గంజాయితో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
డ్రగ్స్‌కు అలవాటు పడిన యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండంతో ఇది పోలీసులకు తలనొప్పిగా మారిం ది. గం జాయి సేవించిన యువత ఏమి చేస్తున్నారో వారికే తెలియ డం లేదు. గంజాయి దందాకు ఆదిలోనే చెక్ పెట్టకపోతే నడిగడ్డ యువతకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. గంజాయి సరఫరా చేస్తున్న, దానిని తీసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్పా చెక్ పడే అవకాశం లేదు.
గుట్టుగా దందా..
యువతను లక్ష్యంగా చేసుకొని కొందరు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లలు, యువతను ఎంచుకొని వారికి గుట్టుగా గంజాయి విక్రయిస్తున్నారు. దీనిని తీ సుకున్న యువత మత్తులో వికృత చేష్టలు చేస్తున్నారు.
గంజాయిని నేరుగా విక్రయిస్తే అనుమానం వస్తుందనే ఆలోచనతో గంజాయి దందా చేసే వారు అక్రమ మార్గాలు అనుసరిస్తున్నారు. వాస్తవంగా బహిరంగ మార్కెట్లో 50గ్రాముల గంజాయి రూ.400 నుంచి రూ.500వరకు కొనుగో లు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన గంజాయిని సిగరెట్లలో నింపి ఒక్కో సిగరెట్ రూ.200 నుంచి రూ.300 వర కు యువతకు విక్రయించి విక్రయదారులు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇలా అక్రమ దందా చేస్తూ గంజా యి విక్రయించేవారు లక్షలు సంపాదిస్తున్నట్లు సమాచారం.
మత్తులో యువత వికృత చేష్టలు..
మత్తుకు అలవాటు పడిన యువత జిల్లాలో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. గతేడాది గద్వాల మండలం శెట్టిఆత్మకూర్‌లో యువకులు మైనర్బాలికలను వేధించడమే కాకుండా వారి ఇండ్లకు వెళ్లి కుటుంబసభ్యులపై దాడికి య త్నించారు. ఓ ప్రైవేట్ దవాఖానలో పని చేస్తున్న మహిళతోపాటు ఇతరులు మత్తులో ఉండి కాలనీలో గందరగోళం సృష్టించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి వెళ్లగా వారిపై సైతం దురుసుగా ప్రవర్తించడం అప్పట్లో కలకలం రేపింది. కృష్ణా రోడ్డులో ఓ పోకిరి బ్యాచ్ వస్త్రవ్యాపారిపై దాడి చేశారు. ఇలా వెలుగులోకి వచ్చినవి సంఘటనలు కొన్ని అయితే వెలుగులోకి రాని ఘటనలు చాలా ఉన్నాయని సమాచారం.
మే 13న 680గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు
జిల్లాకేంద్రంలోని కుంట వీధికి చెందిన బషీర్ కొంతకాలంగా జిల్లాలో గంజాయిని విక్రయిస్తున్నాడు. హైదరాబాద్‌లోని దూల్‌పేట నుంచి గంజాయిని తీసుకొచ్చి గద్వాలలోని యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తే లింది. యువతకు గంజాయి సప్లయ్ చేస్తున్నాడన్నా సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు అతని కదలికలపై నిఘా ఉంచారు.
గత నెల 13వ తేదీన గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో బషీర్ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో గద్వాల పట్టణ పోలీసులకు అతనిని పట్టుకొని 680గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని అతడిని రిమాండ్‌కు తరలించారు. అయితే ఆ యువకు డు జిల్లా కేంద్రంతోపాటు ఇంకా ఎక్కడక్కడ గంజాయి ని విక్రయించాడనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
అయితే ఈ దందా వెను క ఖద్దరు నాయకులు ఉండడం వల్ల ఎవరెవరికి గంజాయి విక్రయించాడో పోలీసులు బయట పెట్టనట్లు తెలుస్తోంది. యువతను చెడు దారి పట్టించే గంజాయి అమ్మకాల వెనుక ఎంత టి వా రు ఉన్న పోలీసులు ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని గం జాయి విక్రయాలకు చెక్‌పెట్టి యువతను కాపాడాల్సిన అవసరం వారిపై ఎం తైనా ఉన్నది.