నాగర్‌కర్నూల్/వనపర్తి టౌన్/గద్వాల/పాలమూరు, జూన్ 9: ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. కందనూలు జిల్లా వ్యాప్తంగా 18 సెంటర్లు ఏర్పాటు చేయగా 5,221మందికి గానూ 4,184 మంది పరీక్ష రాశారు. అందులో 2,657 మంది పురుషు లు కాగా, 1527 మంది మహిళా అభ్యర్థులున్నారు. గైర్హాజరైన వారిలో 621మంది పురుషులు కాగా, 416 మంది మహిళా అ భ్యర్థులున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నాగర్‌కర్నూల్ బాలుర ఉన్నత పాఠశాల, పాలెంలోని వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. కాగా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని 14 సెంటర్లు, పాలెంలోని 2 సెంటర్లు, తెలకపల్లిలోని 2 కేంద్రాల వద్ద పోలీసులతో పటిష్టమైన బం దోబస్తు ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లావ్యాప్తంగా 17 పరీక్షా కేంద్రాలకు గానూ పట్టణంలో 15, కొత్తకోటలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొత్తం 4,843 మందికి గానూ 4,007 మంది హాజరు కాగా 836 మంది గైర్హాజరైనట్లు రీజినల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలు ఏర్పా టు చేశారు. కాగా, జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ బాలుర, బాలికోన్నత పాఠశాలలోని కేంద్రాలను కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్ పరిశీలించారు. మొత్తం 5,234 మందికి గానూ 4,200మంది పరీక్ష రాయగా.. 1,034 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యా ప్తంగా 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశా రు. కొందరు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు వారిని లోపలికి అనుమతించలేదు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మె డికల్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రవినాయక్ పర్యవేక్షించారు. అదేవిధంగా జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని అదనపు ఎస్పీ రాములు పర్యవేక్షించారు. మొత్తం 15,199 మందికి గానూ 12,176 మంది పరీక్ష రాయగా 3,023మంది గైర్హాజరయ్యారు.