వెల్దండ మే 5: వడగళ్ల వానతో పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టం అంచనా వేయాలని బీఆర్ఎస్ నాయకుడు పురుగుల లాలయ్య డిమాండ్ చేశారు. శనివారం రాత్రి ఈదురు గాలులు, వడగళ్లతో కురిసిన భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాలలో చేతికొచ్చిన పంటను నష్టపోయారని అన్నారు. ఏక్వాయిపల్లి, మర్రిపల్లి, ముద్విన్ గ్రామాలలో వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలన్నారు.
పంటనష్టం కారణంగా రైతులు చేసిన అప్పులు ఎలా తీర్చాలో పాలుపోని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.40 వేలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.