అలంపూర్ క్షేత్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, రాబోయే రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఆమె అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ్‌కీ నేత, సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేర్చుదామని సూచించారు. కలిసికట్టుగా ఉంటూనే బీఆర్ఎస్ను బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.
అలంపూర్, ఫిబ్రవరి 18 : రాష్ట్రంలోనే ఏకైక శక్తి పీఠం, చారిత్రక ప్రసిద్ధి గాంచిన అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఆమె అలంపూర్ ఆలయాలను దర్శంచుకున్నారు. అధికారులు ఆమెకు పూర్ణకుంభంతో ఘన స్వా గతం పలికారు. అర్చకులు ఆశీర్వచనా లు చేసి తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అలంపూర్ ఆలయాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. అలంపూర్‌లో 6వ శతాబ్ద ఆలయాలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్పు చేసి ఒక్కో బల్దియాకు రూ.10 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేయడంతోపాటు అర్హులకు ప్రభుత్వ పథకాలు అం దిస్తున్నట్లు చెప్పారు.
కులవృత్తులను ప్రో త్సహిస్తుండడంతో నేడు సొంతూళ్లలోనే ఉపాధి పెరిగిందన్నారు. మిషన్ కాకతీ య పనులతో చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. గతం లో పాలమూరు వలసలకు పేరొందగా.. నేడు ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడికే వలసలు వస్తున్నారని వివరించారు. ఇదం తా జోగుళాంబ అమ్మ దయ అన్నారు. సాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశామన్నారు.
ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణకు రూ.11 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చే శారు. గతంలో కేసీఆర్ పాదయాత్ర చేసి న సమయంలో నడిగడ్డలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదని, కానీ నేడు మన నీళ్లు మనం మళ్లించుకోవడంతోపాటు లిఫ్టులను నిర్మించి బీడు భూములను సైతం సాగులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలోని పండుగలకు ఎంతో ప్రత్యేక ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉం టే దేశంలో పరిస్థితి మరోలా ఉందన్నా రు.
మాకెందుకు తెలంగాణ తరహాలో సంక్షేమ పథకాలు అందడం లేదని వివి ధ రాష్ర్టాల ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. అందుకే దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించేందుకు కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. దేశంలో విపరీత ధోరణులను పక్కనపెట్టి సహృదయంతో ఆలోచించే నాయకత్వం రావాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ను స్థాపించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌తోపాటు దేశం సుభిక్షంగా ఉండాలని జోగుళాంబ దేవిని వేడుకున్నట్లు చెప్పారు.
కలిసికట్టుగా ఉంటూనే బీఆర్ఎస్ను బలోపేతం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. దేశ్‌కీ నేత కేసీఆర్ సంకల్పాన్ని నెరవేరుద్దామని సూచించారు. ఆమె వెంట ఎమ్మెల్యేలు అబ్రహం, కృష్ణమోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్, గట్టు తిమ్మప్ప, ఎమ్మెల్యే అబ్రహం కుమారుడు అజయ్, మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ వెంకటేశ్, నాయకులు ఉన్నారు.