దేవరకద్ర రూరల్(చిన్నచింతకుంట)/మక్తల్ టౌన్, జూలై 3 : ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం ఉంద్యాల వద్ద ఫేజ్-1 పంప్‌హౌస్ నుంచి కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు సోమవారం జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డితో కలిసి నీటిని విడుదలను ప్రారంభించారు. అలాగే ఉంద్యాల పంప్‌హౌస్ నుంచి జమ్మికుంట, నల్లకుంట, ఎర్రకుంట చెరువులకు నీటి తరలింపునకుగానూ కాల్వ ఏర్పాటు ప్రాంతాన్ని పరిశీలించారు. కాల్వ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించా రు. అనంతరం రైతులతో సమావేశమై మాట్లాడారు. కాల్వ నిర్మాణంతో అదనంగా 2వేల ఎకరాలు సాగులోకి రానున్నట్లు తెలిపారు. కోయిల్‌సాగర్ ఆయకట్టు కింద ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉంద్యాల పంప్‌హౌస్ నుంచి ప్రస్తుతం తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యమైన కారణంగా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ముం దస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జూరాలకు ఇన్‌ఫ్లో లేనందున ఒకే మోటరుతో నీటిని తరలిస్తున్నామని, భారీ వర్షాలు కురిస్తే రెండు మోటర్లతో పర్ధీపూర్ రిజర్వాయర్‌ను నింపనున్నట్లు తెలిపారు. అంతకుముందు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ దివంగత సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాయిచంద్ అకాల మృతి రాష్ర్టానికి తీరనిలోటని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట రాము తదితరులు పాల్గొన్నారు.