ఊట్కూర్ : అజ్ఞానాన్ని తొలగించి ప్రతి మనిషిలో జ్ఞానాన్ని పెంపొందించడమే ఆర్య సమాజ్ (Arya Samaj ) లక్ష్యమని పండిత్ ప్రియదత్తు శాస్త్రి ( Priyadutt Shastri ) అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఆర్య సమాజ్ మందిరంలో శనివారం శ్రావణ వేద త్రిదివసీయ యజుర్వేద పారాయణ మహా యజ్ఞం నిర్వహించారు. కార్యక్రమంలో దంపతులు పాల్గొని అగ్ని దేవతకు నెయ్యి, సామాగ్రి, సమిధలు, సుగంధ పరిమళం సమర్పించారు
. ఈ సందర్భంగా పండిత్ ప్రియ దత్తు శాస్త్రి మాట్లాడుతూ.. వేదాలను పఠించి ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా నడుచుకోవాలని ఉపదేశించారు. కార్యక్రమంలో భాగంగా ఆర్య సమాజ్ ప్రధాన్ కనకప్ప ఆర్య, కమిటీ సభ్యులు జ్ఞానేశ్వర్ రావు ఆర్య, బాల్ రాజ్ ఆర్య, పవన్ కుమార్ ఆర్య, సుజాత భజనలు, భక్తి గీతాలతో అలరించారు. కార్యక్రమానికి హాజరైన వారికి తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పద్మా రెడ్డి, రామ్ మనోహర్ రావు, శంకరయ్య, దివాకర్ యాదవ్, గోపాల్ రెడ్డి, టీ. వెంకటేష్, దొడ్డి శ్రీనివాసులు, రమాదేవి పాల్గొన్నారు.