మక్తల్ టౌన్, డిసెంబర్ 22 : రాష్ట్రంలో సాగు నీటికి కొ రత లేకుండా ప్రతి ఎకరాకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలించే 47 ప్యా కేజీ మెయిన్ కెనాల్ కోతకు గురైన సందర్భంగా గురువారం ఎమ్మెల్యే దగ్గరుండి మరమ్మతు పనులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గ రైతంగా కలల స్వప్నమైన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలించే 47 ప్యాకేజీ మెయిన్ కెనాల్ మక్తల్ పెద్దచెరువు మత్తడి (అలుగు పారడం) వల్ల కోతకు గురైందని తెలిపారు. వర్షాకాలంలో భారీస్థాయిలో నీటి ప్ర వాహం కెనాల్‌కు రావడం వల్ల కోతకు గురవడంతో మరమ్మతు పనులు చేపట్టామన్నారు. యాసంగి సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా రైతులకు పూర్తిస్థాయిలో సాగు నీరందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంతో పనులను యుద్ధ ప్రాతిపదికన చేయించామన్నారు.
చెక్కు పంపిణీ
దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి రోగులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ ఆరోగ్యం లభించాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ చేపట్టిన సీఎం సహా య నిధి అని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని మాగనూర్ మండలం ఆలంపల్లి గ్రామానికి చెందిన మౌనికకు రూ.36వే ల విలువ చేసే చెక్కును ఎమ్మెల్యే నివా సంలో గురువారం లబ్ధిదారులుకు అం దజేశారు.
ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.