మహబూబ్నగర్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తుది విడుత ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. చివరి విడుతలో అన్ని జిల్లాల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగాయి. అప్పటికే లైన్లో ఉన్న ఓటర్లను ఓ టు వేసేందుకు అవకాశం కల్పించారు. మహబూబ్నగర్లో 88.36శాతం, నాగర్కర్నూల్ జిల్లా 83.01శాతం, నారాయణపేట జిల్లా 83.53 శా తం, గద్వాల జిల్లా 88.54 శాతం, వనపర్తి జిల్లాలో 85.55 శాతం పోలింగ్ నమోదైంది. మహబూబ్నగర్ జిల్లాలో 1,42,9 09 ఓట్లకు గానూ 1,26, 280 ఓట్లు పోలయ్యాయి.
నారాయణపేట జిల్లాలో 1,52,648 ఓట్ల గానూ 1, 27,502 ఓట్లు, నాగర్కర్నూల్ జిల్లాలో 1,79,464 ఓట్లకు గానూ 1, 49,22 2 ఓట్లు, గద్వాల జిల్లాలో 1,00,372 ఓట్ల కు గానూ 88,865 ఓట్లు, వనపర్తి జిల్లాలో 1,30, 159 ఓట్లకు గా నూ 1,11357 ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూ డు విడుతల్లో ప్రశాంతంగా ముగియడంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. పోలింగ్, కౌంటి ంగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పరిశీలించారు. అక్కడి సిబ్బందికి ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు జారీ చేశారు. కాగా నారాయణపేట జిల్లాలో తుదివిడుత ఎన్నికల్లో వృద్ధులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై ఎన్నికల సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పోలింగ్..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లో మూడో వి డుత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా ముగిసింది. మూడు విడుతల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా కొనసాగాయని కలెక్టర్ విజయేందిరబోయి తెలిపారు. మూడో విడుత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పో లింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారు లు తీరారు. మహబూబ్నగర్ జిల్లాలో ఉదయం 9 గంటల సమయానికి సగటున 25.38 శాతం పో లింగ్ నమోదైంది. 11 గంటల సమయానికి 60. 63 శాతం, ఒంటి గంటకు 81.44 శాతం, తుది పోలింగ్ శాతం 88.36 శాతం ఓటింగ్ జరిగింది. కాగా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిరబోయి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం నుంచి పోలింగ్ కేంద్రాల్లో పర్యటించి పోలింగ్ ప్రక్రియ పరిశీలించారు.
ఆయా జిల్లాల కలెక్టర్లు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించి అక్కడున్న అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా మెడికల్ క్యాంప్, ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అని తనిఖీ చేశారు. మూడో విడుతలో మొత్తం 504 సర్పంచ్ స్థానాలకు మొత్తం 9485 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగా యి. ఎక్కడికక్కడ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకు నేలా విస్తృత ఏర్పాట్లు చేయడమే కాకుండా, ఫొటోలతో కూడిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేయడం, బీఎల్వోలతో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి ఓటర్లకు వారి ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది అనే విషయాన్ని తెలియజేసేలా చర్య లు తీసుకోవడంతో ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు, వెబ్ కా స్టింగ్ జరిపించామని, మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ తీరును పరిశీలించారు. కలెక్టరేట్ల నుంచి కూ డా ఆయా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగగా, నిర్ణీత సమయంలోపు క్యూ లైన్లలో నిలుచున్న వారికి కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణం గా ఓటు వేసే అవకాశం కల్పించారు. పో లింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుం చి కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడించేలా విస్తృత చర్యలు చేపట్టారు. మొత్తం పైన మూ డు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.