గద్వాలలో గూడులేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేరింది. శనివారం జిల్లా కేంద్రంలో డబుల్బెడ్రూం ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం మొత్తం 1,275 ఇండ్లు నిర్మించగా.. వాటిలో 771 ఇండ్లకు డ్రా నిర్వహించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ క్రాంతి లక్కీడిప్ తీసి లబ్ధిదారులను ఎంపిక
చేశారు. వీరిలో 39 ఇండ్లు దివ్యాంగులకు కేటాయించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– గద్వాల, ఏప్రిల్ 15
గద్వాల, ఏప్రిల్ 15 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గూడు లేని పేదలను గుర్తించిన తర్వాతే డిప్ద్వారా డబుల్బెడ్రూం ఇండ్లు కేటాయించినట్లు కలెక్టర్ క్రాంతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో దివ్యాంగులకు సంబంధించి డబుల్బెడ్రూం ఇండ్లను శనివారం కలెక్టర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొని డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకేంద్రం సమీపంలో ప్ర భుత్వం 1,275 ఇండ్లు నిర్మించిందన్నా రు. అందులో 771 ఇండ్లకు డిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చే శామని తెలిపారు. మిగతా 504 ఇండ్లకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నందున వాటికి డిప్ వేయలేదని.. క్లియరె న్స్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారు ల ఎంపికలో అనర్హు లు ఉంటే.. వారం రోజుల్లో తమ దృష్టికి తీసుకురావాలన్నారు. విచారణ చేసి చర్యలు తీసుకోవడంతోపాటు ఇంటిని కూడా రద్దు చేస్తామని వెల్లడించారు. దివ్యాంగులు 65 మంది దరఖాస్తు చేసుకోగా డిప్లో 39 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారు కుటుంబ సభ్యుల ఆధార్‌కార్డు, ఆదా యం, కుల సర్టిఫికెట్ ఒరిజినల్స్‌ను సోమవారం నిర్వహించే వార్డుసభల్లో ఇవ్వాలని సూచించారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా..
గతంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులకే ఇండ్ల ప ట్టాలు ఇచ్చారని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్టీలకతీతంగా అర్హులందరికీ డిప్ ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డబుల్బెడ్రూం ఇండ్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ పేదలపక్షాన ఉం టూ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారన్నారు. డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీతో పేదల చిరకాల ఇంటి కల నెరవేరిందన్నారు. గతంలో నాయకులు చెప్పిన వాళ్లకే ఇండ్లు ఇచ్చేవారని.. నేడు ఆ పరిస్థితి లేదని వివరించారు. మరికొన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని.. వాటిని త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. ఇండ్లు రా నివారు అధైర్యపడొద్దని.. తమ వద్ద అర్హుల జాబితా ఉందని.. త్వరలోనే ప్రభుత్వ భూ మిని గుర్తించి రెండువేల మందికి గృహలక్ష్మి పథకం కింద ఇండ్ల పట్టాలిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, జెడ్పీ ఇన్చార్జి సీఈవో ము సాయిదాబేగం, ఆర్డీవో రాములు, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల మోముల్లో చిరునవ్వు
నిరుపేదలకు సొంతింటి కళ సాకారమైన వేళ వారి మో ముల్లో చిరునవ్వులు చిందించాయి. గతంలో ఏదైనా పథకానికి అర్హత పొందాలంటే నాయకులు, మధ్యవర్తుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రతి పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో డబుల్బెడ్రూం ఇండ్లు ని ర్మిస్తున్నది. గద్వాల మున్సిపాలిటీలో 5,155 మంది దరఖా స్తు చేసుకోగా.. 3,171 మందిని అధికారులు విచారణ చేసి అర్హులుగా గుర్తించారు. రాజకీయ నాయకుల ప్రమేయం లే కుండా.. ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా నిజమైన లబ్ధిదారులకు డిప్ ద్వారా ఇండ్లు కేటాయించారు.
అదృష్టం అంటే వీరిదే..
గద్వాల పట్టణానికి చెందిన చాకలి శైలజను అదృష్టం వరించింది. డిప్ ద్వారా చేపట్టిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో మొదట ఎమ్మెల్యే, తరువాత కలెక్టర్.. ఆ తరువాత అదనపు కలెక్టర్, అధికారులు, పాత్రికేయులు, లబ్ధిదారులు డిప్ తీశారు. ఈ క్రమంలో శైలజ డిప్ తీయగా.. ఆమెకే ఇల్లు వచ్చింది. తన ఇంటిని తానే ఎం పిక చేసుకోవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. అలాగే చివరి నిమిషంలో పేరు నమోదు చేసుకున్న మల్దకంటన్నకు కూడా డిప్లో ఇల్లు వచ్చింది.
చాలా సంతోషంగా ఉన్నది..
మాకు ఇల్లులేదు. అద్దెకు ఉంటున్నాం. సొంత ఇల్లు ఉంటే బాగుండని అనుకునేవా ళ్లం. సీఎం కేసీఆర్ సారు పుణ్యమా అని డిప్ లో డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నది. మా కుటుంబం అంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. ఇప్పుడు మాకు కూడా సొంత ఇల్లు ఉందని గర్వంగా చెప్పుకొంటాం. సీఎం సారు సల్లంగా ఉండాలె.
– తిరుపతమ్మ, లబ్ధిదారురాలు
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..
నేను దివ్యాంగురాలిని. ఏ పనీ చేయలేను. సొంత ఇల్లు లేక గుడిసెలో ఉంటున్నాం. డబుల్బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాను. డిప్లో ఇల్లు రావడంతో చాలా ఆనందంగా ఉన్నది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులకు ఇల్లు ఇస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. పేదోళ్ల సొంతింటి కళ నెరవేర్చిన సారు నిండు నూరేళ్లు బతకాలి.
– మార్తమ్మ, లబ్ధిదారురాలు