బొమ్మలకు జీవం..
దేశం కళలకు, కళాకారులకు పుట్టినిల్లు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కళలకు ప్రాణం పోస్తూ వాటిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత మన భారతీయులకే దక్కింది. శిల్పులు తమ నైపుణ్యంతో ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా శిలలు, సిమెంట్, ఫైబర్ విగ్రహాలను తయారు చేస్తూ కళకు జీవం పోస్తున్నారు.
- ప్రతి ఏడాది మట్టి వినాయక విగ్రహాల తయారీ
- సిమెంట్, ఫైబర్ విగ్రహాల తయారీతో ఉపాధి
దేశం కళలకు, కళాకారులకు పుట్టినిల్లు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కళలకు ప్రాణం పోస్తూ వాటిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత మన భారతీయులకే దక్కింది. శిల్పులు తమ నైపుణ్యంతో ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా శిలలు, సిమెంట్, ఫైబర్ విగ్రహాలను తయారు చేస్తూ కళకు జీవం పోస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామానికి చెందిన బి.కృష్ణ అదే కోవకు చెందిన వాడు. ఆలయాలపై బొమ్మలు, దేవతామూర్తులను తీర్చిదిద్దుతూ జీవనం సాగించేవాడు.
-కల్వకుర్తి రూరల్, జూన్ 25
రాష్ట్ర రాజధానిలో పలు ఆలయాలపై బొమ్మలను వేయడానికి వచ్చిన కృష్ణ కల్వకుర్తి పరిసర ప్రాంతాల్లో ఉపాధి లభించడంతో కల్వకుర్తి పట్టణంలో స్థిరపడిపోయాడు. ఆలయాలపై బొమ్మల వేయడంతోపాటుగా జాతీయ నాయకుల విగ్రహాలను తయారు చేస్తూ ప్రతి ఏటా వినాయక చవితికి మట్టి వినాయకలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు.
జీవం ఉట్టిపడేలా..
కృష్ణ ఏ బొమ్మను తయారు చేసినా ఆ బొ మ్మకు జీవం పోసినట్లుగా ఉంటుంది. బొ మ్మల తయారీని వ్యాపారంలా కాకుండా ప్రతి ఒక్కరి మన్ననలు పొందేలా త యారు చేస్తున్నాడు. జాతీయ నాయకులు మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, నెహ్రూజీ, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ విగ్రహాలు , ఇలా ఎవరి బొమ్మలనైనా ఆర్డర్ చేసిన రో జుల వ్యవధిలోనే సిద్ధం చేస్తున్నాడు. అంతేగాకుండా దేవతామూర్తుల విగ్రహాలు, గు డి గోపురాలు, గర్భగుడులను అందంగా సిమెంట్ శిల్పాలను వేసి వన్నె తెస్తున్నాడు. వీటితోపాటుగా ఇప్పుడు సిమెంట్, ఫైబర్ విగ్రహాలను తయారు చేస్తున్నాడు. 18 ఏండ్ల కిందట ఆంధ్రా నుంచి ఆమనగల్లు మండలంలోని ఆలయ గర్భగుడి నిర్మాణానికి ఈ ప్రాంతానికి వచ్చాడు. హైదరాబాద్, మహబూబ్నగర్, కల్వకుర్తి పరిసర ప్రాం తాల్లో ఎక్కడ గుడి నిర్మాణాలు, విగ్రహాల ఏ ర్పాటు జరుగుతున్నా అది ఖచ్చితంగా కృష్ణ వేసినవిగా గుర్తింపు పొందాడు.
మట్టి వినాయక విగ్రహాల తయారీ
పీవోపీతో పర్యావరణం పూర్తిగా కలుషితమవుతుండడంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా తన వంతు కృషిగా మట్టితో వినాయకుడి వి గ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నాడు. వినాయకుడి విగ్రహాలను వివిధ ఆకృతుల లో తయారు చేసి వాటికి సహజమైన రంగులను అద్ది విక్రయిస్తున్నాడు. విగ్రహాలను రూ. 50 నుంచి 5వేల వరకు వాటి ఎత్తు, ఆకృతులు, వైవిధ్యమైన రంగుల్లో తయారు చేస్తున్నాడు. మ ట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణతోపాటుగా నీటిలో వేగంగా కరిగిపోతుందని పీవోపీ వినాయకులతో కాలుష్యం చోటు చేసుకుంటుందని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. వినాయకుడి మట్టి విగ్రహాలు, జాతీయ నాయకుల విగ్రహాలు, తెలంగాణ తల్లి, ఇలా పలు రకాలుగా బొమ్మలను త యారు చేస్తూ కళను చాటుతున్నాడు. తయారుచేసిన ప్రతి బొమ్మలో వారి ప్రతి రూపం ప్రతిబింబించేలా తయారుచేయడం ఆయన ప్రత్యేకతగా మారింది.
ఆదరణ చాలా బాగుంది
కల్వకుర్తి నియోజకవర్గంతోపాటు షాద్నగర్, అచ్చంపేటతోనియోజక వర్గాల్లో సి మెంట్ విగ్రహాలకు ఆదరణ చాలా బాగుం ది. గ్రామాల్లో ఏర్పాటు చేసే విగ్రహాల నిర్మాణాల కోసం ఆర్డర్లు రావడంతో కల్వకుర్తి పట్టణంలోనే స్థిరపడ్డాను. దేశ నాయకుల విగ్రహాలు సిమెంట్ , ఫైబర్లో సీజన్లో వినాయక మట్టి విగ్రహాలను తయారు చేసి ఇస్తున్నాను. వాటి ఎత్తును బట్టి సమయం తీసుకొని బొమ్మలను తయారు చేస్తున్నా ను. ఈ ప్రాంతంతోపాటుగా పరిసర జిల్లాల నుంచి కూడా విగ్రహాల తయారీకి ఆర్డర్లు వ స్తుండడంతో జీవనోపాధి పొందుతున్నాను.
– కృష్ణ , విగ్రహ తయారీ దారుడు, కల్వకుర్తి
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

