గద్వాల, జనవరి 25 : రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు నిరంతరం కృషి చేసిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో గట్టు మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రైతు పార్వతమ్మ మృతి చెందగా ప్రభుత్వం నుంచి మంజూరైన రైతు బీమా(రూ.5లక్షల) చెక్కు ను ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు రైతుల సంక్షే మం కోసం అనేక సంక్షే మ పథకాలు ప్రవేశ పెట్టిందని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగింద ని గుర్తు చేశారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ఉచిత విద్యు త్, రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి రైతు ను ఆదుకున్నదని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేయని పథకాలు కేసీఆర్ అమలు చేసి వారికి చేయూత నిచ్చారని వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్‌కుమార్, సింగిల్‌విండో డైరెక్టర్ మహేశ్వర్‌రెడ్డి, నాయకులు రాము, విజయ్‌రెడ్డి, రామకృష్ణగౌడ్, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.